జయకు పనికిరాని ఎక్మో సాఫ్ట్ వేర్ కు పనికొచ్చింది...
posted on Dec 13, 2016 3:50PM
.jpg)
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో అత్యాధునిక చికిత్సను సైతం జయలలితకు అందించారు. అంతేకాదు ఆఖరి అస్ర్తంగా ఎక్మో పద్దతిని కూడా ఉపయోగించారు. కానీ ఇవేమీ అమ్మ ప్రాణాలను మాత్రం నిలుపలేకపోయాయి. అయితే ఈ ఎక్మో పద్దతి అమ్మ ప్రాణాలను అయితే కాపాడలేకపోయింది కానీ... ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు మాత్రం కాపాడింది. అసలు సంగతేంటంటే.. బెంగుళూరుకు చెందిన 43 ఏళ్ల శ్రీనాథ్ సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే హఠాత్తుగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో వెంటనే అతని కుటుంబసభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెద్యులు జయలలితకు చేసిన ఎక్మో చికిత్సను శ్రీనాథ్ కు చేశారు. 24 గంటలు తిరిగేలోపల శ్రీనాథ్ గుండెను మామూలుగా కొట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. ఆ తరువాత కోలుకున్న శ్రీనాథ్ మాట్లాడుతూ.. తనకు పునర్జన్మ ఎత్తినట్టు ఉందని తెలిపాడు. మొత్తానికి అమ్మకు పనిచేయని చికిత్స.. ఓ సాప్ట్ వేర్ ప్రాణాలను మాత్రం నిలబెట్టింది.
నారాయణ హృదయాలయ ఇప్పటివరకు 500 మందికి ఎక్మో చికిత్సను అందించిందట. ఈ చికిత్సకు రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.