ఉప్పల్ టెస్ట్: కష్టాల్లో ఆసీస్ 74/2

Publish Date:Mar 4, 2013

 

 

 Cheteshwar Pujara double century, Pujara double century, Pujara hits double Australia

 

 

ఉప్పల్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజూ ఇండియా 154.1 ఓవర్లలో 503 పరుగులు చేసి ఆలౌటైంది. ఛటేశ్వర్ పూజారా చెలరేగి 332 బంతుల్లో డబుల్ సెంచరీ 204 పరుగులు చేశాడు. కెరీర్‌లో పూజారాకు ఇది రెండో ద్విశతకం. డబుల్ సెంచరీతో పుజారా టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేశారు. ఆసీస్ పై భారత్ 266 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లు మాక్స్‌వెల్ 4, దోహార్తి-3, ప్యాటిన్సన్ 2, సిడిల్ ఒక వికెట్ తీసుకున్నారు.

 

అనంతరం బ్యాటింగుకు దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 74 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత్ 192 పరుగుల ఆధిక్యంలో ఉంది.


ఇండియా స్కోర్ వివరాలు : విజయ్ : 167, సెహ్వాగ్ : 6, పుజారా : 204, సచిన్ : 7, కోహ్లీ : 34, ధోనీ ఐ 44, జడేజా : 10, అశ్విన్ 1, హర్భజన్ సింగ్ : 0, కుమార్ : 10, ఇషాంత్ శర్మ నాటౌట్ : 2, ఎక్స్‌ట్రా : 18.