చంద్రబాబు హర్టయ్యాడట!

 

 

chandrababu, kadiyam sri hari, tdp chandrababu, kadiyam chandrababu

 

 

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించిందని, పార్టీ వైఖరి పూర్తి అనుకూలంగా ఉందని కడియం శ్రీహరే బహిరంగంగా చెప్పారు. అప్పుడు కనిపించిన స్పష్టత ఇప్పుడు ఎటుపోయింది? ఇప్పుడు కొత్తగా కనిపించిన అస్పష్టత ఏమిటి' అని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు కొందరు బాబుతో భేటీ అయిన సందర్భంగా కడియం ప్రస్తావన వచ్చింది.


కడియంకు పార్టీలో ఏం తక్కువ చేశామని ఇప్పుడు విమర్శిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. 'తెలంగాణలో ఆయన కంటే ముందు నుంచీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్లున్నా వారిని కాదని కడియంకు మంత్రి పదవి ఇచ్చాను. పొలిట్‌బ్యూరో సభ్యుడిని చేశాను. ఎందరో సీనియర్లు అడిగినా కాదని అఖిలపక్షానికి పార్టీ ప్రతినిధిగా ఆయననే పంపాను. మొన్న కూడా వచ్చి కలిసినప్పుడూ ఇలాంటి అభిప్రాయమేదీ వ్యక్తం చేయలేదు.



గంటా రెండు గంటలు కూర్చుని అలా చేస్తే బాగుంటుంది.. ఇలా చేస్తే బాగుంటుందని సలహాలిచ్చి ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి? ఆయన చెప్పినవాటిలో పార్టీ ఏది కాదంది? ఆయనకు ప్రతి విషయంలో పార్టీ సహకరించింది. నాయకులు రావచ్చు.. పోవచ్చు. కానీ ప్రజలు అవినీతికి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న తరుణంలో ఇలా చేయడం బాధాకరం. పోయినవాళ్ల గురించి వదిలేసి యువనాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం. వీళ్లంతా పార్టీలోకి వచ్చినప్పుడు యువకులే' అని వ్యాఖ్యానించారు.