ఉప్పల్ టెస్ట్: ఆస్ట్రేలియా237/9, భారత్ 5/0

 

 

 Bhuvneshwar Kumar gives Australia early jolt, Australia india, uppal test india Australia

 

 

హైదరాబాద్ ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 237 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మూడు ఓవర్ల ఆట మిగిలిన ఉన్న స్థితిలో ఇన్నింగ్సును డిక్లేర్ చేసి, భారత ఓపెనర్లపై ఒత్తిడి పెంచేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్రయత్నించాడు. అంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులతో, మురళీ విజయ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ను భునేశ్వర్ కుమార్ మూడు ప్రధాన వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ను కెప్టెన్క్ క్లార్క్‌, మాథ్యూ వాడే ఆదుకున్నారు. అర్థ సెంచరీ చేసిన తర్వాత వాడే 62 పరుగుల వద్ద హర్భజన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు చెయ్యలేకపోయారు. క్లార్క్ 91 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు.


భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసుకోగా, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. డిక్లేర్ చేసే సమయానికి పాటిన్సన్ ఒక పరుగుతో, దోహర్తీ జీరో పరుగులతో క్రీజులో ఉన్నారు.