లాలూకి ఝలక్ ఇచ్చిన అఖిలేశ్...

Publish Date:Jan 10, 2017

 

ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంకు తనయుడు వ్యతిరేకత చూపించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో  నేతకు అఖిలేశ్ ఝలక్ ఇచ్చాడు. అది ఎవరో కాదు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు. గత కొద్ది రోజులుగా ములాయంకు, అఖిలేశ్ కు మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ములాయం బంధువైన లాలూ ప్రసాద్ యాదవ్ అఖిలేశ్ కు ఫోన్ ఈ వ్యవహారంపై మాట్లాడారంట. ఈ సందర్భంగా లాలూ, అఖిలేశ్ తో  బాబూ, ఎంతైనా కన్న తండ్రి కదా. ఆయన కష్టం వల్లే పార్టీ ఈ స్థాయిలో నిలబడింది. నాన్నను పార్టీ అధ్యక్షుడిగా అంగీకరించు అని చెప్పగా.. దీనికి సమాధానంగా, "మా మంచి కోరే వ్యక్తిగా మీ మాటను కాదనలేను. కానీ ఇప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. ఎన్నికలు అయ్యేంత వరకు పార్టీని నేనే నడుపుతా. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పార్టీ పగ్గాలను నాన్నకు అప్పజెబుతా. అంత వరకు మీరే కాదు... మరెవరు చెప్పినా వినను" అని అఖిలేష్ చెప్పారట. దీంతో, లాలూ షాక్ అయ్యారట. మొత్తానికి ఎన్నికలు పూర్తయ్యేవరకూ అఖిలేశ్ ఎవరి మాట వినట్టే కనిపించడంలేదు.

By
en-us Politics News -