ఉద్యోగం చేసే చోట ఉద్యోగస్తుల్లా మెలగాలి కాని ఆడపిల్లల్లా కాదు అంటున్నారు నిపుణులు. అంటే సున్నితత్వం, లాలిత్వం ఆడవారి నైజం అయినా ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు వాటిని దూరంగా పెట్టడమే మంచిదట. అలాగే మేం ఆడవాళ్ళం అని గుర్తుచేసేలా కొన్ని పనులు అలవాటుగా చేసేస్తుంటారు కొందరు. వాటికి దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఆ అలవాటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది. వంటలని పంచిపెట్టడం. ఏ కొత్త స్వీటో చేసినపుడు, ఏ కొత్త వంటకాన్నో తయారు చేసినపుడు స్నేహితులకి రుచి చూపించటం తప్పు కాకపోయినా, ఆఫీసులోని కొలిగ్స్ కి కూడా ఆ రుచులను పంచాలనుకోవటం కరెక్ట్ కాదట. పూర్తి ప్రొఫెషనల్ రిలేషన్ మెయింటేన్ చేయాలంటే అలా వంటల రుచులు చూపించకపోవటమే మొదటి సూత్రం.   మన శారీరక కదలికలు, నుంచోవటం, నవ్వటం, నడవటం ఇవన్నీ మన ఆత్మవిశ్వాసాన్ని బహిర్గత పరిచేలా వుండాలి. అలా కాక నలుగురు ఉన్నచోట సర్దుకుపోవాలని ఆలోచించినపుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ ఆలోచనలకి తగ్గట్టే ఉంటుంది. ఇది మిమ్మల్ని మీపై అధికారులు అంచనా వేసేటపుడు తప్పుడు సంకేతాలు అందిస్తుంది. సర్దుకుపోవటమనేది మీ ఆప్షన్ గా ఉండలే గాని, ప్రతీ విషయంలో అదే పరిష్కారం కాకుడది గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు.   "లీడర్"కి ఉండాల్సిన మొదటి లక్ష్యం ఇతరులతో సమర్థవంతంగా పనిచేయించగలగటం... అన్నీ తన బాధ్యత అనుకుంటూ ఎన్నో పనులని పైన వేసుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. చాలా మంది తాము లేకపోతే ఆర్గనైజేషన్ నడవదన్నట్టు మాట్లాడుతుంటారు మరికొందరు. అయితే తన పని తాను చేస్తూనే, తన కిందివారు కూడా తమ పనులని సమర్థవంతంగా చేసేలా చేయటం నాయకత్వ లక్షణమని గుర్తించి అలా నడుచుకోగలిగితే తప్పకుండా ఓ మంచి లీడర్ అనిపించుకుంటారట ఆడవారు. అలాగే ఆర్డర్ చేయాల్సిన చోట రిక్వెస్టింగ్ గా చెప్పటం కూడా మిమ్మల్ని ఎదుటవారు తక్కువ అంచనా వేసేందుకు కారణమవుతుంది కాబట్టి ఇతరులతో వ్యవహరించేటపుడు స్పష్టమైన వైఖరి అవసరం అంటున్నారు నిపుణులు.   ఇతరులతో మాట్లాడేటపుడు తలవంచుకోవటం, అటు ఇటు చూడటం కాకుండా... ఎదుటి వ్యక్తితో నేరుగా చూస్తూ మాట్లాడటం మంచి పద్ధతట. అలాగే ఆఫీసు వాతావరణంలో నవ్వుల్ని ఆచితూచి వాడలట. సరదా అంటూ అతి చనువుని ప్రదర్శించే వారిని ముందే కట్టడి చేయాలట. ఆఫీసులో వారు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు అన్నీ విషయాలపై మీకు ముందే అభిప్రాయం ఉండాలి. అప్పుడే మీరు అందుకు తగ్గట్టు ప్రవర్తించటం సులభమవుతుంది అంటున్నారు నిపుణులు.   ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పురుషులతో కరచాలనం చేయాల్సి వచ్చినపుడు చాలా మంది ఇబ్బంది పడతారు. మొహమాటంగా అందీ అందనట్టు చేయి ముందుకు చాపటం మనలోని ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని సూచిస్తుందట. అందుకే కరచాలనం చేయాల్సి వచ్చినపుడు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడి, ఎదుట వ్యక్తిని చూస్తూ చేయి కలపాలి. మన మాటలు కూడా సూటిగా, స్పష్టంగా క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. అనవసర గాసిప్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ మన ఉద్యోగ బాధ్యతల్ని మనం సమర్థవంతంగా నిర్వర్తించటానికి సహాయపడే అంశాలు.                                                                                                    -రమ

  మన దగ్గరి వ్యక్తుల మనస్తత్వాలని ఎలా అర్థం చేసుకోవచ్చో సరదాగా నేర్చుకుందామా? ఎదుటి వ్యక్తికీ నచ్చిన పండు ఏదో తెలుసుకుంటే... దాని బట్టి వారి స్వభావం గురించి అంచనా వేయచ్చట. మన ఇష్టాయిష్టాలు సహజంగా మన స్వభావం, మనస్తత్వం పై ఆధారపడే ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు మన స్వభావానికి అద్దం పడుతాయన్నమాట. సరే నచ్చే పండుని బట్టి వారి స్వభావాన్ని ఎలా అంచనా వేయచ్చో తెలుసుకుందాం.   ఆరెంజ్ : ఆరెంజ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తుల స్వభావం ఎలా వుంటుందో చూద్దాం. వీరు చాలా సహనంగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరి పనితీరు నెమ్మదిగా అనిపించినా కష్టపడే తత్వం వీరి స్వంతం. ఏ బంధంలోనైనా వంద శాతం ఇస్తారు. నమ్మకస్తులు ఎవరైనా ఈ వ్యక్తులపై పూర్తి భరోసా పెట్టవచ్చు. వీరిని ఫ్రెండ్ గా పొందని వారు అదృష్టవంతులనే చెప్పాలి.   ఆపిల్ : ఆపిల్ అంటే చాలా ఇష్టమని అన్నారనుకోండి... వాళ్ళు ది బెస్ట్ టీం లీడర్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ముందుండి ఓ టీంని నడిపించే నాయకత్వ లక్షణాలు వీరి స్వంతం. ఉన్నదున్నట్టు ఎదుట వ్యక్తి మొహంపై చెప్పేస్తారు. కాస్త పోగరుబోతుల్లా కనిపిస్తారు. కాని వీరి స్వబావం అది కాదు నిజానికి. కాని మాట కాస్త కరుకుగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి కానీ, వీరి లైఫ్ ను వీరే సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించుకోవటంలో కంగారు పడతారు. మామిడి : మామిడి పండును ఇష్టపడే వ్యక్తుల స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి ఆలోచనలలో చాలా క్లారిటి వుంటుంది. వీరిని, వీరి ఆలోచనలని, పద్దతులని ప్రభావితం చేయటం అంత సులువు కాదు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీరి జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది. అయితే నచ్చిన వారి దగ్గర పిల్లల్లా మారిపోతారు.. అల్లరి చేసి ఆనందిస్తారు. బొప్పాయి : ఈ పండును ఇష్టపడే వ్యక్తులు మన స్నేహితులయితే చాలు. మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ విరుస్తునే వుంటుంది. మంచి హాస్య స్వభావులు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులతో ఎంతో దయగా ఉంటారు. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోగలరు. సఖులూ. ఫైనాఫిల్, అనాస : వీళ్ళు ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకుంటే చాలు... వెంటనే మొదలు పెట్టేస్తారు. ధైర్యం ఎక్కువ తనపై తనకుండే నమ్మకమే అందుకు కారణం. వీరికి దేనినైనా సాధించటం ఎంతో తేలిక. అయినా వ్యక్తిగతంగా వీరు ఎవరితోనూ తొందరగా కలవలేరు. కాని ఒకసారి స్నేహితులయితే ఎంతో విలువనిస్తారు ఆ బంధానికి ... కాని వీరిలో బంధంలో ఉండేవారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. వీరికి మనసులోని అభిమానాన్ని బయటకి చూపించటం రాదు. నల్ల ద్రాక్ష : వీళ్ళు మృదు స్వభావులు, కాని ముక్కుపై కోపం వుంటుంది. ఎంత తొందరగా కోపం వస్తే, అంత త్వరగా చల్లారిపోతారు. వీరితో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. వీరికి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా ఉంచుకోవాలో బాగా తెలుసు. ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. సీతాఫలం : వీళ్ళు చాలా లక్ష్యాలు కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. విజయాల కోసం కష్టపడతారు. అయితే ఎదుటి వ్యక్తుల లోని లోపాలని ఇట్టే పసిగడతారు. దాంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువే. వీరు అభిమానాన్ని పైకి చూపరు. ఎదుటివారు అర్థం చేసుకోవాలి. అరటి పండు : వీళ్ళు ఎదుటివారిపై ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. అయితే తమ విషయానికి వచ్చేసరికి వారిపై వారికీ నమ్మకం తక్కువ. పక్కవారి తోడుకోసం చూస్తుంటారు. స్వభావసిద్ధంగా వీరు విజయాలకంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.                                                                                                         -రమ

  ఏకాగ్రత ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు అని అందరికి తెలిసిందే. అయితే మన లక్ష్య సాధనాలే కాదు. ఆనందంగా ఉండటానికి కూడా ఏకాగ్రత దోహదపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ మధ్య ఆనందానికీ, ఆలోచనకూ మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవటానికి అమెరికాలో ఒక అధ్యయనం నిర్వహించారట. దీనిలో భాగంగా 83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వయసుల వారిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. వాటి ఆధారంగా అధ్యయన కర్తలు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేసేవారు అంత ఆనందంగా ఉంటారని తేల్చారు.   83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వివిధ వయసుల వారిని ఏ యే సమయాలలో ఎలా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు. అప్పుడు వారి అనుభూతి వంటి, ఏ పని చేస్తున్నప్పుడు ఏ దృక్పథంతో వున్నారు వంటి అంశాల పై ప్రశ్నించి వాటిని విశ్లేషించి, పరిశీలించారు. వీరిలో చాలా మంది పనిచేస్తున్న, TV చూస్తున్నా, తింటున్నా, చివరికి షాపింగ్ చేస్తున్న ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు గుర్తించారు. ఫలితంగా ఆ సమయంలో న్యాయంగా పొందల్సినంత ఆనందాన్ని వారు పొందలేకపోతున్నారని గుర్తించారు పరిశోధకులు.   ఏకాగ్రతతో చేసే ఏ పనైనా పూర్తి ఆనందాన్ని అందిస్తుంది అని రుజువు చేయటానికి చేసిన అధ్యయనంలో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించేవారు అనుభూతులను పూర్తిగా ఆస్వాదించలేరు అని తేలింది. నిజానికి మనం మనకి తెలియకుండానే నిరంతరం ఆలోచనల్లో మునిగి వుంటాం. అవి సంతోషాన్నిచ్చే ఆలోచనలు అయినపుడు అప్పటి మన అనుభవంతో సంబంధం లేకుండా మన మనసు సంతోషంగా వుంటుంది, అదే నెగెటివ్ ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతుంటే ఆనందాన్నిచ్చే విషయాలుకి మన ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వుండదు. ఏది ఏమైనా మనసు లగ్నం చేయందే ఏ పని పూర్తి ఆనందాన్ని అందించదు అని ఖచ్చితంగా చెబుతున్నారు అధ్యయకర్తలు.   మన మనసుకి బాధ కలిగించే సంఘటన ఏదైనా జరిగినపుడు ఆ ప్రభావం మన ఆలోచనలపై పడుతుంది. మన ఆలోచనలన్ని వ్యతిరేక భావంతో ఉంటాయి. ప్రతి అంశం మనకి నచ్చనట్టుగానే అనిపిస్తుంది. ఆ సమయంలో మనం వంట చేసినా, ఆఫీసు పని చేసినా ఏదైనా మన మనసు పూర్తిగా ఆ పనిపై లగ్నం కాదన్నది నిజం. దాంతో ఆ చేసేపని మనకి విసుగ్గా అనిపిస్తుంది. దాంతో ఆ పని సరిగ్గా చేయలేం, ఫలితం కూడా అలాగే ఉంటుంది. దాంతో తిరిగి మనం మరింత వ్యతిరేక భావనలో కూరుకుపోతాం. ఇది ఒక వలయంలో అలా సాగుతూనే వుంటుంది. చాలా మంది జీవితం విసుగ్గా ఉంది అనటానికి కారణం అదే. అందుకే నిరంతరం మనపై దాడిచేసే ఆలోచనల నుంచి తప్పించుకోవటం అలవాటు చేసుకోవాలి.   మన మనసుకి ఏకాగ్రత అలవాటు చేయటం కష్టం కాదు. ధ్యానం, యోగా వంటివి మనలో ఏకాగ్రత పెంచుతాయని చెబుతారు పెద్దలు. ఈ వయసులో నాకెందుకు అనుకోకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని వాటికి కేటాయిస్తే మనసుకి ఏకాగ్రత అలవాటుగా మారుతుందో ప్రతీ పనిని ఆనందించగలుగుతాం. అనుభూతులని అందుకోగలుగుతాం. కాబట్టి సఖులూ ఆనందంగా వుండాలంటే "ఏకాగ్రత" ఉండాల్సిందే.                                                                                                         -రమ

అందమైన చేతి సంచులు స్ట్రింగ్ డ్ పౌచ్.. లేటెస్ట గా పార్టీలలో మనందరికి కనిపిస్తూ మురిపిస్తున్న ఈ పొట్లి బ్యాగ్ ని అచ్చ తెలుగులో చెప్పాలంటే చేతి సంచి అనవచ్చు. పూర్వం మన అమ్మమ్మ,నాయనమ్మ వాడిన చేతి సంచికే కాస్త అలకారం చేస్తే ఇలా స్టైలిష్ స్ట్రింగ్ డ్ పర్స్ గా మారిపోయింది. ఇవి ఇప్పుడు నెట్టెడ్ , వెల్వెట్ లాంటి  ఫ్యాబ్రిక్ లతోపాటు పాలిసిల్క్ అలాగే  రకరకాల కాటన్ ప్రింట్లతో పాటు సింపుల్ గ కూడా దొరుకుతున్నాయి.ఫోన్, మని, క్రెడిట్ , కార్డులు ఇందులో చక్కగా సరిపోతాయి.వీటిని అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు ,'బటువా' పర్సులని పిలుస్తారు , మరీ ఇలాంటి 'బటువా' లు మీ దగ్గర వున్నాయా . లేకపోతె వెంటనే షాపింగ్ చెయ్యండి . ఈ సారి పార్టీలో  మీ పౌచ్ తో   మెస్మరైజ్ చేయండి అందర్ని...