యోగాతో మెనోపాజ్ సమస్యలకు స్వస్తి

 

డివయసు దాటిన స్త్రీలకు మెనోపాజ్ చాలా సహజమైంది. మెనోపాజ్ దశలో స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. యోగతో ఈ మెనోపాజ్ సమస్యలను నివారించుకోవచ్చు. అవును, ప్రత్యేకమైన మెడిసిన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే యోగ సాయంతో మెనోపాజ్ దశలోనూ హాయిగా, ఆనందంగా ఉండొచ్చు. అదెలా అంటారా? పూర్తిగా చదవండి...

మెనోపాజ్ దశలో శరీరం స్త్రీ సహజమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపుతుంది. నెలసరి ఆగుతుంది. సంతానోత్పత్తి లాంటి చర్యలు ఆగిపోతాయి. ఈ మార్పుల వల్ల శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. నిద్ర కరువౌతుంది. ఆకలి తగ్గుతుంది. ఆహారమే కాదు, నీళ్ళు కూడా తాగాలనిపించదు. ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. కొందరు ఆడవాళ్ళు ఆస్టేపొరోసిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇక పైకి ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాల్లో కోపం, విసుగు, అసహనం ప్రధానమైనవి. శరీరంలో జరిగే మార్పుల వల్ల ఓర్పు నశిస్తుంది. అతి చిన్న విషయాలకు కూడా అతిగా రియాక్ట్ అవడం, ఎవరోఒకరి మీద , ఏదో ఒక అంశమై అరవడం చూస్తుంటాం.

ఈ రకమైన మెనోపాజ్ సమస్యలను తరిమి కొట్టేందుకు యోగాలో ఎంబ్రయోపోజ్ చాలా ఉపయోపడుతుంది. ఇది ఎలా చేయాలంటే ముందుగా బోర్లా పడుకోవాలి. పొట్ట మీద బరువు మోపుతూ తల వీలైనంత పైకి ఎత్తాలి. రెండు కాళ్ళు  దగ్గరగా ఉంచి పైకి ఎత్తి, చేతులను వెనక్కి పోనివ్వాలి. ఇప్పుడు కుడి చేత్తో కుడి కాలును, ఎడం చేత్తో ఎడమ కాలిని పట్టుకోవాలి. శ్వాసను మెల్లగా, పూర్తిగా తీసుకుంటూ, అంతే మెల్లగా, సంపూర్తిగా వదలాలి.

రోజూ క్రమం తప్పకుండా ఈ ఎంబ్రయో యోగాసనం అరగంట పాటు చేసినట్లయితే, మెనోపాజ్ సమస్యలు దూరమౌతాయి. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి.