ఆఫీసులో క్మిస్మస్ పార్టీ.. ఇదిగో సూపర్ ఔట్ ఫిట్ డిటైల్స్..!

ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ పండుగ కోసం ఏడాది పొడవునా ఎదురు చూసేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా కార్పోరేట్ కంపెనీలు విదేశాలకు చెందినవి కావడంతో చాలా కార్పోరేట్ ఆఫీసులలో క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంటుంది. సీక్రెట్ శాంటా పేరుతో గిఫ్ట్ లు ఇచ్చుకోవడం నుండి కేక్ కటింగ్, గేమ్స్, పార్టీ.. ఇలా చాలా జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంటి దగ్గర పండుగ జరుపుకున్నట్టు కాకుండా ఆపీసులో పార్టీ కావడంతో అటు అందం చెదరకూడదు, ఇటు హుందాగా కూడా ఉండాలి. ఇలాంటి ఔట్ పిట్ కోసం చాలా ఎదురు చూస్తారు. సౌకర్యంగా ఉంటూ అందంగా, ఆకర్షణీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలంటే కింద చెప్పుకునే ఔట్ ఫిట్ లు ట్రై చేయవచ్చు. అలాగే ఎంచుకునే రంగులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతకీ ఆ ఔట్ ఫిట్ లు ఏంటో తెలుసుకుంటే..
రెడ్-గ్రీన్ షేడ్స్..
క్రిస్మస్ పండుగకు కేటాయించిన రంగులు ఎరుపు, ఆకుపచ్చ. ఈ రంగుల దుస్తులు, చొక్కాలు లేదా చీరలు ధరించవచ్చు. క్యాజువల్ పార్టీకి అటెండ్ అవుతుంటే ఎరుపు రంగు స్వెటర్, డెనిమ్‌తో కూల్‌గా కనిపించవచ్చు. దుస్తులలో ఎరుపు, ఆకుపచ్చ లేదా తెలుపు రంగులు ఉండేలా చూసుకుంటే పార్టీకి న్యాయం చేసినట్టే.
షైనింగ్ దుస్తులు..
పార్టీ కొంచెం గ్లామరస్ గా ఉంటే బంగారు లేదా వెండి గ్లిట్టర్ డ్రెస్ మంచి ఎంపిక అవుతుంది. ఇది పార్టీలో జిగేలు రాణి లాంటి లుక్ ఇస్తుంది. ఈ లుక్ పార్టీకి స్టార్ గా మార్చేస్తుంది. అయితే ఆఫీసుకి గ్లిట్టర్ డ్రెస్ రెగ్యులర్ గా వేసుకునేవారు పార్టీలో కూడా అదే వేసుకుంటే ప్లాన్ బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ వేర్ లో గ్లిట్టర్ వాడేవారు దీన్ని పార్టీలో అవాయిడ్ చేయాలి.
చీర..
క్రిస్మస్ పార్టీకి సాంప్రదాయ లుక్ కావాలంటే ఎరుపు లేదా ఆకుపచ్చ చీర ధరించడం బెస్ట్. భారతీయ సంప్రదాయ దుస్తులలో చీర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దుస్తులను క్రిస్మస్ పార్టీకి జోడిస్తే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఆల్-బ్లాక్ లుక్..
సింపుల్ గా గ్రాడ్ లుక్ కావాలి అంటే మంచి నలుపు రంగు దుస్తులను ఎంచుకోవాలి. నల్లటి దుస్తులతో జత చేసిన రెట్రో-శైలి ఆభరణాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పూర్తిగా నల్లటి లుక్ చాలా అందంగా, మెస్మరైజ్ చేస్తూ క్లాసీగా కనిపిస్తుంది.
యాక్ససరీస్..
క్రిస్మస్ పార్టీలో దుస్తులతో పాటు లుక్ మొత్తం సూపర్ గా కనిపించడానకి స్టైలిష్ బెల్ట్, నగలు లేదా ట్రెండీ గా ఉండే హ్యాండ్‌బ్యాగ్ వంటి కొన్ని మంచి యాక్ససరిస్ ను ఎంచుకోండి. వీటిని ఎంచుకొనేటప్పుడు అవి ఓవర్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సింపుల్ గా ఉంటూనే సూపర్ గా, పార్టీకి అట్రాక్షన్ గా కనిపిస్తారు.
*రూపశ్రీ.


.webp)
