కాటుక వాడే అమ్మాయిలు ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు!
 


అదేంటో గానీ అబ్బాయిల ముఖంలోనూ, అమ్మాయిల ముఖంలోనూ అవయవాలన్నీ ఒకే విధంగా ఉన్నా అమ్మాలకు క్రెడిట్ ఎక్కువ. కళ్లు, ముక్కు, పెదవులు, నుదురు, బుగ్గలు ఇలా ప్రతిదీ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల కళ్లను చూసి ఫిదా అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి, నుదుటన బొట్టుతో అమ్మాయిలు కనిపిస్తే బాపు బొమ్మ అనే ట్యాగ్ ఇచ్చేవారు. అయితే కాలంతో పాటు ఫ్యాషన్ మారింది. ఫ్యాషన్ కు తగ్గట్టు పాత సౌందర్య ఉత్పత్తులు కొత్తగా పరిచయం అవుతున్నాయి. వాటిలో కాజల్ కూడా ఒకటి. కాటుకను ఫ్యాషన్ గా కాజల్ అని పిస్తుంటారు. వాటర్ ప్రూప్ అని చాలా రకాలుగా కాటుక అందుబాటులోకి వచ్చాక అమ్మాయిలు వివిధ రకాలుగా కాటుక అప్లై చేసి కళ్లను మెరిపిస్తారు. అయితే ఇప్పట్లో కాటుక వాడుతున్న అమ్మాయిలు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్న తరువాత బహుశా ఖచ్చితంగా షాకవుతారు.

కాటుక వెనుక నిజం..

ఇప్పట్లో కాటుకను కాజల్ అని, పెన్సిల్ తోనూ, కోన్ తోనూ, స్కెచ్ తోనూ పెట్టడం అలవాటైంది. ఎక్కువసేపు ఇది నిలిచి ఉండాలనే కారణంతో బ్యూటీ ఉత్పత్తులు కాజల్ తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. ఒకప్పటిలా ఆవు నెయ్యి, బాదం, ఔషద మూలికలతో తయారైన కాటుక కాకపోవడం   వల్ల నేటి కాలం కాజల్ కళ్లకు నష్టం కలిగిస్తాయి.

కాటుక పెడితే కళ్లు అందంగా కనిపిస్తాయేమో కానీ వాటిలో ఉన్న జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్ధాలు కళ్లకు ప్రమాదం కలిగిస్తాయి. ఇవి కళ్లకు అప్లై చేసిన తరువాత రాత్రికి అంతా క్లీన్ చేయాలి. లేకపోతే రసాయనాలు చర్మంలో ఇంకిపోయి డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అవుతుంది. అందుకే రాత్రి సమయంలో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించాలి. అందుకోసం కింది పద్దతులు ఫాలో అవ్వాలి.

కళ్ల చుట్టూ ఉన్న కాటుకను తొలగించడానికి వేజిలైన్ లేదా ప్రెట్రోలియం జెల్లీ వాడాలి. గోరుతో కొద్దిగా పెట్రోలియం జెల్లీ తీసుకుని దాన్ని కళ్లకు అప్లై చేసి మెల్లిగా మసాజ్ చేస్తూ కాటుక తొలగించుకోవాలి. తరవాత కాటన్ ప్యాడ్ తో తుడిచేసుకోవాలి.

చాలామంది మేకప్ రిమూవ్ చేయడానికి క్లెన్సింగ్ మిల్క్ వాడతారు. ఇది కాటుక తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్ మీద క్లెన్సింగ్ మిల్క్ తీసుకుని దానితో కంటి చుట్టూ మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కాటుక తొలగిపోతుంది.

రోజ్ వాటర్ చాలామంది బ్యూటీ కేర్ లో ఉపయోగిస్తారు. కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ తో తడిపి దీంతో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించవచ్చు. ఇవన్నీ చాలా తక్కువ ధరలో కాటుక తొలగించుకోవడానికి సురక్షితమైన పద్దతులు.

                                            *నిశ్శబ్ద