ఇవి శ్వాస ప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించు క్రియలు.
1. రెండు ముక్కు రంధ్రాల ద్వారా త్వరత్వరగా, గబ గబా శ్వాస వదలాలి, పీల్చాలి. ఇది భస్త్రిక.
2. కుడి ముక్కు రంధ్రం మూసి ఎడమ ముక్కురంధ్రం ద్వారా గాలి త్వరత్వరగా, గబ గబా వదలాలి, పీల్చాలి. ఇది చంద్రాంగ భస్త్రిక.
3. ఎడమ ముక్కు రంధ్రం మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి త్వరత్వరగా, గబ గబా వదలాలి, పీల్చాలి. ఇది సుర్యాంగ భస్త్రిక.
4. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా త్వరత్వరగా, గబగబా గాలి వదలాలి, పీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా త్వరత్వరగా, గబగబా గాలి వదలాలి, పీల్చాలి. ఇది సుషుమ్నా భస్త్రిక.
లాభాలు :
శరీర మందలి మాలిన్యం విసర్సించబడి అవయవాలకు శుద్ధి కలిగి వాటికీ స్ఫూర్తి లభిస్తుంది.