విజయ్ ఆంటోని మూవీ "భద్రకాళీ"లో రెండు సాంగ్స్ రాయడానికి భోలే షావలికి ఛాన్స్
on Jun 30, 2025
.webp)
విజయ్ ఆంటోని మూవీ "మార్గన్" టీమ్ తో ఏమంటా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారో చాలా మందికి ఆఫర్స్ ఇచ్చారు ఆయన. జడ్జ్ ఇంద్రజ భోలే షావలి గురించి చాల మంచిగా చెప్పారు. వండర్ ఫుల్ లిరిక్ రైటర్ అని మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు విజయ్ ఆంటోనీకి. "ఆయన ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసి ఫెంటాస్టిక్ ఆల్ రౌండర్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తారు" అని చెప్పారు. దాంతో విజయ్ ఆంటోని ఫుల్ ఖుషీ ఇపోయారు ఐతే "మీరు లిరిక్ రైటర్ ఐతే గనక నా రాబోయే సినిమా భద్రకాళి మూవీలో మీరు టు సాంగ్స్ రాయబోతున్నారు..ఇది నా ప్రామిస్" అని చెప్పారు. "భద్రకాళి మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. నేను మీతో టచ్ లో ఉంటాను. మీరు నా మూవీ 2 పాటలు రాయాల్సిందే " అని చెప్పారు. అలాగే నాటీ నరేష్ ఐతే బిచ్చగాడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసేసరికి విజయ్ ఫుల్ ఫిదా ఇపోయారు.
"నరేష్ నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. డైలాగ్స్ ని ఎంత ప్రోపర్ గా చెప్పావో చూసాను. డైలాగ్స్ ని పంక్ట్యువేషన్ (punctuation ) కి తగ్గట్టే చెప్పారు. సక్సెస్ఫుల్ యాక్టర్ కూడా మీరు. మిమ్మల్ని నేను తమిళ్ లో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నా. నరేష్ నేను నీతో టచ్ లో ఉంటాను. ఇక్కడ ఎంత మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను చెన్నైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నా.. అందరినీ నా మూవీస్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్న" అని చెప్పారు విజయ్ ఆంటోని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



