బిగ్ బాస్ 9 లోకి రాజ్ తరుణ్, ఇమ్మానుయేల్
on Jun 30, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈ షో ప్రోమోలు కూడా వస్తున్నాయి. ఐతే హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఐతే సోషల్ మీడియాలో లో వేళ్ళు వెళ్లొచ్చు, వాళ్ళు వెళ్లొచ్చు అంటూ కొన్ని గాసిప్స్ నడుస్తున్నాయి. ఐతే రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ అలాగే హీరో రాజ్ తరుణ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇమ్మానుయేల్ బిగ్ బాస్ కి వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్ము జర్నీ జబర్దస్త్ లో కమెడియన్ నుంచి టీమ్ లీడర్ అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వస్తున్నాడు అలాగే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కెప్టెన్ కూడా అయ్యాడు. అతని ఇన్స్పైరింగ్ జర్నీ కాబట్టి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే హీరోగా కొన్ని సినిమాలు చేసి ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకున్నాడు.
తర్వాత తన ఫామిలీ ఇష్యుస్ కారణంగా నిత్యం వార్తల్లో నిలిచాడు. ఇక లావణ్య, ఆరియానా, శేఖర్ బాషా, రాజ్ తరుణ్ మధ్య ఎన్ని గొడవలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. ఐతే రాజ్ తరం ఈమధ్య సోషల్ మీడియాలో కానీ బిగ్ స్క్రీన్ మీద ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ అసలు ఎలా ఎంటర్టైన్ చేస్తాడో, ఇక వీళ్ళతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



