Tasty Teja Elimination: టేస్టీ తేజ ఎలిమినేషన్.. కన్నడ బ్యాచ్ కి బయాజ్డ్ బిగ్ బాస్!
on Nov 30, 2024
బిగ్ బాస్ సీజన్-8 పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఈ సీజన్ లో ప్రతీ వారం తెలుగు కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేషన్ అవుతూ వచ్చారు. కానీ ఫస్ట్ టైమ్ గతవారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. మరి ఈ వారం లీస్ట్ లో ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడా లేదా అనేది క్యూరియాసిటిగా మారింది.
కన్నడ బ్యాచ్ కి బిగ్ బాస్ బయాజ్ గా ఉంటూ వారిని ప్రతీవారం సేవ్ చేస్తూ వస్తున్నాడు. మరి ఈ వారం కూడా వారిని హౌస్ లో ఉంచి టేస్టి తేజని ఎలిమినేట్ చేస్తాడా లేదా అంటు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కమెడీయన్లు చీప్ గా చూసే పృథ్వీ లాంటి వారికి విష్ణుప్రియ సపోర్ట్ గా ఉండటం.. నిఖిల్ బ్యాక్ బిచ్చింగ్ కి మిగిలిన వాళ్ళు తోడవడంతో జెన్యున్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. అవినాష్ ప్రతీ వారం అటు టాస్క్ లలో ఇటు ఎంటర్టైన్మెంట్ లో వందకి వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. కానీ బయట జనాలేమో గేమ్ చూడకుండా ఓట్లు వేస్తున్నారు. ముఖ్యంగా విష్ణుప్రియ లాంటి వరెస్ట్ కంటెస్టెంట్ ని ఇంకా ఎందుకు సేవ్ చేస్తూ వస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది బిగ్ బాస్ షోనా లేక బయాజ్డ్ షోనా అంటు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
హౌస్ లో డస్ట్ బిన్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో విష్ణుప్రియ వల్ల కూడా అంతే యూజ్ అని ఒకరు, హౌస్ లో గ్రూప్ గా ఆడే వారికేమో ఓటింగ్ ఉంది. కానీ ఇండివిడ్యువల్ గా ఆడుతూ జెన్యున్ కంటెస్టెంట్స్ కి సరైన ఓటింగ్ లేదు. అయితే గౌతమ్ ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని బయటపెట్టాడు. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం హోస్ట్ నాగార్జున కూడా కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని సపోర్ట్ చేశాడు. కానీ అది తప్పు అని ఆడియన్స్ కి తెలుసు. నబీల్ విన్నర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అతడి గేమ్ రోజురోజుకి పడిపోయింది. అయిన సరే ఓటింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే హౌస్ లో గేమ్ ని బట్టి కాకుండా ఫస్ట్ పది వారాల్లో ఆట చూసి ఓటింగ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నామినేషన్లో ఉన్నవారిలో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు.
Also Read