దెయ్యాలను చూడడానికి చంద్రగిరి కోటకు వెళ్లిన గీతూ
on Nov 30, 2024
గీతూ మోటివేషనల్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక ఇంకా ఫేమస్ అయ్యింది. అలాంటి గీతూ దెయ్యాలు సంబంధించి ఒక విషయం చెప్పింది. చిట్ చాట్ విత్ బిగ్ బాస్ టీం 2 పేరుతో వచ్చిన ఒక చాటింగ్ లో ఈ దెయ్యాల విషయాలను షేర్ చేసుకుంది. " నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రగిరి కోటకు స్కూల్ లో ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు దెయ్యాలని చూడాలనిపించింది. కోటలో దెయ్యాలు ఉంటాయని అప్పట్లో ఎవరో చెప్పారు అందుకే చూద్దామనిపించింది. అందుకే 4 గంటల తర్వాత దెయ్యాలుంటాయంట చూసి వెళదాం ఎవరికీ చెప్పొద్దూ మనం అని అక్కడ ఎవరికీ కనిపించకుండా ఒక చోట దాక్కుని ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఆరోజు రాత్రి 7 గంటల వరకు అక్కడే దెయ్యాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టైంకి కోట మొత్తం ఒక్కసారిగా చీకటైపోయింది.
చుట్టూ అక్కడ ఎవరూ కూడా లేరు. మాకేమో టెన్షన్ వచ్చేసింది. భయమేసేసింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. నిజంగానే దెయ్యాలు వచ్చేస్తాయేమొ అని భయపడ్డాం. ఫుల్ గా చెమట్లు పట్టేసాయి. ఈలోపు స్కూల్ వాళ్ళు గీతూ గీతూ అని అరుస్తూ పిలిచారు. ఎలాగో భయంతోనే మా వాళ్ళను వెతుక్కుంటూ నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చాము.. అప్పుడు అక్కడున్న వాచ్ మ్యాన్ ని అడిగితే అదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు అంటూ పంపించారు. ఆ దెయ్యాల దెబ్బతో నాకు వారం రోజులు జ్వరం వచ్చేసింది. ఏదో దెయ్యాలను చూద్దామని ట్రై చేయబోయి జ్వరం తెచ్చుకున్నా. అప్పటి నుంచి దెయ్యాల జోలికి పోవడం లేదు. అప్పటి నుంచి దెయ్యాలంటే చాలా భయం నాకు" అని చెప్పింది గీతూ.
Also Read