బిఆర్ఎస్ ఎంఎల్సి కవితతో యష్, సోనియా...తొలి బోనం ఎత్తిన సోనియా ఆకుల
on Jun 27, 2025
.webp)
ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండగ జాతర సంబరాలు షురూ అయ్యాయి. ఎటు చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. బోనాలు అంటే బోనం ఎత్తడం ముఖ్యం. ఇక రీసెంట్ గా తెలంగాణాలోని గోల్కొండ కోట మీద వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో తొలి బోనంతో సందడి మొదలయ్యింది. ముందుగా మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించారు బిఆర్ఎస్ ఎంఎల్సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈమెతో పాటు ఈ బోనాల జాతరలో యష్ వీరగోని, సోనియా ఆకుల కలిసి మొదటి బోనం ఎత్తారు. ఈ విషయాన్నీ సోనియా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఫస్ట్ బోనం ఎత్తడం నిజంగా ఆ దైవ సంకల్పం.
బోనాల పండగ మీ జీవితాల్లో సంతోషాల్ని తేవాలనుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేసింది. అలాగే వీళ్ళిద్దరూ బోనం ఎత్తి అలా నడుచుకుంటూ వెళ్లడాన్ని కూడా చూపించింది సోనియా. కవితతో కలిసి ఉన్న పిక్స్ ని సోనియా పోస్ట్ చేసింది. ఇక సోనియా మూవీస్ లో కూడా నటించింది. జార్జ్ రెడ్డి మూవీలో హీరో సిస్టర్ గా నటించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆశ ఎన్కౌంటర్, కరోనా వైరస్ వంటి మూవీస్ లో కూడా నటించింది. ఆమె ఒక స్వచ్చంద సంస్థ పెట్టి ఆడపిల్లలకు అండగా నిలిచింది. బిగ్ బాస్ 8 సీజన్ తో మంచి పేరు తెచ్చుకుంది సోనియా. ఇక యష్, సోనియా పెళ్ళికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా వచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



