Bigg Boss 9 Telugu Promo : ఈ సారి చదరంగం కాదు రణరంగమే!
on Jun 27, 2025

బిగ్ బాస్ తెలుగు అప్టేడ్ వచ్చేసింది.. అదే ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే బిగ్ బాస్ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్, ఎనిమిది సీజన్లో నిఖిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరుంటారు.. జడ్జ్ ఎవరు అనే క్యూరియాసిటి నిన్నటి వరకు అందరిలో ఉంది. కానీ నిన్న రిలీజ్ అయిన ప్రోమోతో ఆ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి.
నాగార్జున హోస్ట్ గా తాజాగా ఓ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో నాగార్జున ఓ పెద్ద సుత్తి పట్టుకొని వచ్చాడు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అని నాగార్జున చెప్పాడు. ఇక ప్రోమో చివర్లో ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటు ఫైనల్ టచ్ ఇచ్చేశాడు.
ఈ ప్రోమోని బట్టి చూస్తే గత సీజన్లోతో పోలిస్తే గేమ్స్ అండ్ పోటీ ఎక్కువగానే ఉండేట్టుగా ఉంది. ఇక ఆట డోస్ పెంచేట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ సీజన్ కి హోస్ట్ నాగార్జున అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఎప్పుడు మొదలవుతుంది.. కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రోమోని బట్టి చూస్తే మరో మూడు వారాల్లో బిగ్ బాస్-9(Bigg Boss 9 Telugu) ప్రారంభం అయ్యేలా ఉంది. ఇక ఈ ప్రోమో యూట్యూబ్ లో ఇప్పటికే అత్యధిక వ్యూస్ ని తెచ్చుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



