ENGLISH | TELUGU  
Home  » TV News

అదరగొట్టే లుంగీ స్టెప్స్ తో సిరి హనుమంత్!

on Apr 9, 2023

సిరి హనుమంత్ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. షార్ట్ ఫిల్మ్ లతో పాటుగా వెబ్ సిరీస్‌లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. తాజాగా విడుదలైన పులిమేక వెబ్ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్ర చేసి ప్రశంసలు తెచ్చుకుంది సిరి. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ మరోసారి నెటిజన్లకు దగ్గర అయింది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ సంథింగ్' అంటూ కొశ్చనింగ్ స్టార్ట్ చేయగా తన అభిమానులు పలు ప్రశ్నలను సంధించారు. సిరి నువ్వు పెళ్ళి చేసుకుంటావా అని ఒక అభిమాని అడుగగా.. తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. మీరు శ్రీహాన్ కలిసి మళ్ళీ వెబ్ సిరీస్ ఎప్పుడు చేస్తారు అక్క అని ఒక అభిమాని అడుగగా.. చేస్తున్నాం.. షూటింగ్ స్టార్ట్ అయిందని సిరి చెప్పింది. ఇంకా తను పెంచుకుంటున్న చైతు ఏం చేస్తున్నాడని మరొకరు అడుగగా.. ఇంట్లో  చిల్ అవుతున్నాడని సిరి అంది. 'I am Fan of your Hard Work and Dedication and the way you stood in negativity all happiness in future ' అని ఒక అభిమాని  చెప్పగా హే థాంక్ యూ సో మచ్ అని సమాధానమిచ్చింది సిరి. మీకు డాండ్రఫ్, హెయిర్ ఫాల్ లాంటి ఇష్యూస్ ఏం రావా అని ఒకరు అడుగగా.. తను వాడే హెల్త్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్ గురించి వివరించింది సిరి. సిరి వాళ్ళ బ్రదర్ బర్త్ డే కావడంతో.. 'హ్యాపీ బర్త్ డే బామ్మర్ది' అంటూ శ్రీహాన్ సిరి తో కలిసి సిరి వాళ్ళ తమ్ముడు దిగిన ఫోటోని షేర్ చేసాడు శ్రీహాన్.

అయితే శ్రీహాన్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్న సిరి.. అయితే శ్రీహాన్ ఎన్ని తప్పులు చేసిన ఎంత మంది విమర్శించిన తనని క్షమించేస్తూ వస్తోంది సిరి. ప్రస్తుతం మాస్ లుక్ లో లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేసిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా దానికి ఫిదా అయిన తన అభిమానులు సూపర్ అంటూ తమ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.