ENGLISH | TELUGU  
Home  » TV News

‘బ్రహ్మముడి’ సీరియల్ లో కావ్య జర్నీ అలా మొదలైంది!

on Apr 10, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే..  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది. 

అయితే తాజాగా దీపిక రంగరాజు ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియోని అప్లోడ్ చేసింది. 'బ్రహ్మముడి' సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది అంటూ ఆ వీడియోకి టైటిల్ ని పెట్టేసి.. అందులో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన నటీనటులను పరిచయం చేసింది దీపిక.

దీపిక మొదటగా తను ప్రతిరోజూ ఈ సీరియల్ కోసం ఎలా మేకప్ అవుతుందో వివరించింది. ఆ తర్వాత దీపిక 'బ్రహ్మముడి' సీరియల్ కోసం రెగ్యులర్ గా షూటింగ్ జరిగే ఇంటిని చూపించగా..  తర్వాత కెమెరా మెన్ ని, డైరెక్టర్ ని పరిచయం చేసింది. ఆ తర్వాత స్వప్న అలియాస్ హమీదా దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడించింది. ఇంతలో అక్కడికి రాహుల్ వచ్చాడు. కనకం, కృష్ణమూర్తిలతో మాట్లాడించిన కావ్య తను రోజు షూటింగ్ లో ఎలా గడుపుతుందో వివరించింది.  బ్రహ్మముడి' కావ్యగా గుర్తించినందుకు ఈ సీరియల్ అభిమానులకు థాంక్స్ చెప్పుకొచ్చింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.