అవార్డులు, అవకాశాలు పక్క రాష్ట్రాల నటీనటులకు...చప్పట్లకు మాత్రమే తెలుగువాళ్లు
on Dec 4, 2024

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా తెలుగు వాళ్ళే నటించేవాళ్ళు. తర్వాత టాలీవుడ్ లో ఎన్నో మార్పులు వస్తూ వచ్చాయి. దాంతో అటు మూవీస్ లో కావొచ్చు ఇటు సీరియల్స్ లో కావొచ్చు అంతా వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చి నటించడం స్టార్ట్ అయ్యింది. లోకల్ వాళ్ళు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సంస్కృతీ మరీ ఎక్కువైపోయింది. ఐతే రీసెంట్ గా ఈ అంశం మీద టీవీ సీరియల్స్ లో నటించే శ్రావణి కూడా ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఐతే ఇక్కడ తెలుగు వాళ్లకు వేరే భాషల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు.
ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళను తీసుకొచ్చి నటింపజేసే వాళ్ళు ఉంటారు అని చెప్పింది. మనల్ని వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళను మన సీరియల్స్ లోకి పిలిచినప్పుడు వెళ్లి చేయడం వరకు ఓకే కానీ తేడా ఎక్కడ వస్తోంది అంటే మనవాళ్ళు వెళ్లి మరీ వాళ్ళను పిలుస్తారు.. వాళ్ళు మాత్రం మనవాళ్లను పిలవరు. తెలుగు వాళ్ళను పెట్టొచ్చుగా అని మన డైరెక్టర్స్ ని అడిగితే ఎక్కడున్నారు అని మనల్నే అడుగుతారు..పొరపాటున ఏదైనా ఇలాంటివి అడిగితే వాళ్ళను తీసేసి పక్కన పెట్టేస్తారేమో అని భయంతో ఎవరూ ఏమీ అడగరు. మనవాళ్ళు వేరే ఇండస్ట్రీస్ కి వెళ్తే అక్కడ ఆఫర్స్ ఇవ్వరు..అసోసియేషన్ కార్డు లేదు అని అంటారు. కొత్త ప్రాజెక్ట్ వస్తోంది అని ఎవ్వరైనా చెప్పినప్పుడు కాస్టింగ్ ఎవరు అని అడిగితే చాలు బెంగుళూరు, పూణే, చెన్నై వెళ్లి వెతకాలి అంటారు అంతే కానీ లోకల్ గా ఉండే తెలుగు వాళ్ళను చూడరు. ఇక బుల్లితెర మీద వచ్చే రకరకాల షోస్ కి కూడా లోకల్ వాళ్ళను అస్సలు కన్సిడర్ చేయరు. అవార్డ్స్ కూడా బయట స్టేట్స్ నుంచి వచ్చి నటించేవాళ్లకే ఇస్తారు లోకల్ గా ఉండే తెలుగు నటులంతా కూడా చప్పట్లు కొట్టడానికి అవార్డ్స్ ఫంక్షన్స్ కి వెళ్తాము. తెలుగు ఆర్టిస్టులకు డబ్బులు పెంచమని అడిగితే అంత బడ్జెట్ లేదు అంటారు కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చే ఆర్టిస్టులకు మాత్రం ఫ్లయిట్ టికెట్ వేసి, వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసి రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకొస్తారు అంటూ చెప్పుకొచ్చింది శ్రావణి. జెమిని ప్రసారమైన కల్యాణ తిలకం సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది శ్రావణి ప్రియా. అభిషేకం, ఆడదే ఆధారం,భార్యామణి,ఆకాశగంగ,అగ్ని సాక్షి,మూగమనసులు,స్వాతి చినుకులు,గిరిజా కళ్యాణం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



