జ్యోతిని చూస్తుంటే ఇలియానాని చూస్తున్నట్టు గా ఉంది
on Dec 4, 2024

జ్యోతి పూర్వజ్ అంటే తెలీకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అంటే టక్కున గుర్తొచ్చేస్తుంది. ఆమె సోషల్ మీడియాకే హీట్ పుట్టించే హీరోయిన్ మెటీరియల్.. ఆమె పెట్టే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ వేలల్లో, లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఆమె స్ట్రక్చర్ కానీ ఆమె ఫేస్ కానీ నెటిజన్స్ కి బాగా నచ్చుతాయి. దాంతో ఆమె ఏ వీడియో పెట్టినా వందల కొద్దీ మెసేజెస్ ని కుమ్మరిస్తూ ఉంటారు. అలాంటి జ్యోతి రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది. అది కూడా ఓల్డ్ హిందీ సాంగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. " ఓఓ జానే జానా" అనే సాంగ్ కి జ్యోతి డాన్స్ ఇరగదీసేసింది. వేసింది చిన్న స్టెప్స్ కానీ ఆ గ్రేస్ వేరే లెవెల్.
ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్స్ ఐతే జ్యోతిని చూస్తుంటే ఇలియానాని చూస్తున్నట్టు గా ఉంది, మోడరన్ మడోనాలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జ్యోతి ఎం చేసినా కూడా అదొక సెన్సేషన్ ఐపోతుంది. ఐతే ఆమె ఇప్పుడు మూవీస్ లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె తన భర్త సుకు పూర్వజ్ దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగ మరో మూవీ “కిల్లర్” కి ఆమె సైన్ చేసింది.. ఇక జ్యోతి అంటే చాలు జిమ్ వీడియోస్ , ఆమె చేసే వర్కౌట్స్ గుర్తొస్తాయి. మూవీస్ లో చేస్తున్న కారణంగా ఆమె ఎప్పటికప్పుడు తన స్కిన్ టోన్ ని తన స్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటా వస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లే దిశగా ఆమె సైలెంట్ గా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ తో ఫాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



