టీచర్స్ డే రోజున తన గురువులను తలుచుకున్న శేఖర్ మాష్టర్...
on Sep 5, 2025
.webp)
టీచర్స్ డే అంటే ఆ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. వాళ్ళను తీర్చిదిద్దిన గురువులను పూజించుకోవడమే. వాళ్ళను గుర్తు చేసుకోవడం. ప్రతీ ఒక్కరి విజయం వెనక పేరెంట్స్ తో పాటు టీచర్ కూడా ఒక కీ రోల్ పోషిస్తుంది. మరి అలాంటి టీచర్స్ డే సందర్భంగా శేఖర్ మాష్టర్ తన గురువులను గుర్తు చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళతో దిగిన పిక్స్ ని పోస్ట్ చేశారు. "నా డాన్స్ జర్నీలో నాకు ఎన్నో విషయాలను నేర్పి నన్ను ఇన్స్పైర్ చేసిన టీచర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా అతిపెద్ద ఇన్స్పిరేషన్ నాకు ఇష్టమైన గురువు, ప్రభుదేవా మాష్టర్.
నాకు మొదట డాన్స్ నేర్పిన విజయవాడలోని మస్తాన్ మాస్టర్ గారికి, నేను హైదరాబాద్ వచ్చిన తొలినాళ్లలో డాన్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి, అలాగే కొరియోగ్రఫీ రంగంలో రాజసుందరం మాస్టర్ క్రియేటివిటీ నన్నెప్పుడూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. నా స్టార్టింగ్ డేస్ లో నన్నెప్పుడూ ప్రోత్సహించిన సుచిత్ర మాస్టర్, తరుణ్ మాస్టర్, చిన్ని ప్రకాష్ మాస్టర్, రేఖ ప్రకాష్ మేడమ్, అమ్మ రాజశేఖర్ మాస్టర్ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞుడను" అంటూ పోస్ట్ చేసాడు. ఇక శేఖర్ మాష్టర్ కి ఢీ షోతో మంచి పేరొచ్చింది. ఆయన ప్రతీ కొత్త డాన్సర్ ని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్లకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడని చెప్పుకున్న శేఖర్ మాష్టర్ ఈరోజున టాప్ యాక్టర్స్ మూవీస్ లోని సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. ఇక శేఖర్ మాష్టర్ పోస్ట్ కి నెటిజన్స్ ఐతే రాకేష్ మాష్టర్ పేరు కూడా తలుచుకున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేసారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



