హీరో నాని క్లాస్ లో నిద్రపోయేవాడు...రివీల్ చేసిన టీచర్ సుందరమ్మ
on Sep 5, 2025

జయమ్ము నిశ్చయమ్మురా - సెలబ్రిటీ టాక్ షో బై జగపతి బాబు...ప్రతీ ఎపిసోడ్ చాలా యూనిక్ గా ఉంటోంది. అలా ఇప్పటి వరకు నాగార్జున, శ్రీలీలని ఇంటర్వ్యూ చేశారు. ఇక నాని కూడా ఈ టాక్ షోకి ఇన్వైట్ చేశారు. "నేను 5th క్లాస్ టైంలో కొత్త స్కూల్ కి వచ్చాను. నాకు ఇంగ్లీష్ రాదు. మిగతా వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు. తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసేవాళ్ళు. ఆ టైములో నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ గౌరీ , సుందరమ్మ టీచర్ . వాళ్ళు నాకు బాగా ఇష్టం. చాలామంది సార్లు పేర్లు గుర్తున్నాయి కానీ అందరూ నన్ను బాగా ఉతికారు. అందుకే ఆ పేర్లు చెప్పట్లేదు.
ఇక సుందరమ్మ మేడం పరీక్షల టైములో ఇంటికి ఫోన్ చేసి చదువుతున్నానా లేదా అని కనుక్కునేవాళ్ళు..ఆమె ఒక్కరే నన్ను ఎక్కువగా నమ్మేవాళ్ళు " అని చెప్పాడు నాని. ఆ తర్వాత స్టేజి మీదకు నానికి ఎంతో ఇష్టమైన టీచర్ సుందరమ్మను తీసుకొచ్చారు. "నానిని నవీన్ బాబు అనేవాళ్ళం. స్కూల్ లో బానే ఉండేవాడు. అల్లరి చేసేవాడు కాదు కామ్ గా ఉండేవాడు. క్లాస్ లో చక్కగా నిద్రపోయేవాడు. నానికి బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. నాని నిద్రపోయినప్పుడల్లా అటెండెన్స్ తీసుకునే టైములో తన నంబర్ వచ్చేటప్పుడు లేపేవాడు. ఫిఫ్త్ బెంచ్ లో కూర్చునేవాడు. నానికి ఫాజిల్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. రంజాన్ టైములో నాని ఫాజిల్ వాళ్ళ ఇంటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసేవాడు. హోమ్ వర్క్ ఇస్తే నాని చేసేవాడు కాదు. ఈ విషయాన్నీ ఫాజిల్ చెప్పేవాడు. 10th క్లాస్ లో ఒక స్కిట్ వేసాడు. డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ నానీనే. హోస్ట్ ప్రదీప్, నటుడు శర్వానంద్ వీళ్ళు కూడా మా స్కూల్ వాళ్ళే." అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సుందరమ్మ టీచర్ నాని క్లాస్ ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



