Sanjana vs Demon Pavan: డీమాన్ పై విరుచుకుపడ్డ సంజన.. ఫుల్ ఫైర్!
on Dec 11, 2025

బిగ్ బాస్ పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక తుదిదశకి చేరుకుంది. ఈ వారం బిగ్ బాస్ టాస్క్ లు పెడుతూ ఎక్కువ పాయింట్స్ పొందినవారికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇచ్చాడు. అలా మొదటగా ఇమ్మాన్యుయేల్ కీ ఛాన్స్ వచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ కోసం ఇద్దరు ఆటనుండి తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పగా అందరు డిస్కషన్ చేసుకుంటారు. స్కోర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ టాప్ లో ఉంటారు. లీస్ట్ లో సుమన్, సంజన ఉంటారు.
టాప్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని భరణి, సంజన, సుమన్ శెట్టి, తనూజ డిసైడ్ అవుతారు. మేమ్ టాప్ పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడ్డామని డీమాన్ రిక్వెస్ట్ చేస్తాడు. లీస్ట్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని డిమాన్ చెప్తాడు. ఎందుకు ప్రతీసారీ నన్నే తీస్తారు. ఈ వీక్ లో రెండుసార్లు పక్కన పెట్టారు. ఒక మనిషిని ఎన్నిసార్లు చంపుతారంటూ డీమాన్ పై సంజన చెలరేగిపోయింది. సంజన గొడవకి దిగుతుంది. నేను అనేది మీకు అర్థం అవ్వడం లేదు.. అలా చేసుకుంది మీరేనని డీమాన్ అంటాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ చాలా కష్టపడ్డాడని తనూజతో డీమాన్ అనగానే అంటే మేమ్ వట్టిగనే కూర్చొని ఇక్కడికి వచ్చామా ఏంటని తనూజ ఫైర్ అవుతుంది.
ఇక ఆ తర్వాత భరణి, సంజన,తనూజ, సుమన్ వీళ్ళు టాప్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ని టాస్క్ నుండి తియ్యాలని చెప్తారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ లీస్ట్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని చెప్తారు. కళ్యాణ్ కూడా టాప్ లో ఉన్న వాళ్ళని తియ్యాలని చెప్తాడు. దాంతో టాప్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ని టాస్క్ నుండి తీసేస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



