Podharillu: మహా పెళ్ళిచూపులకి ఏర్పాట్లు.. తప్పించుకోగలదా!
on Dec 11, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -03 లో..... మహా తన ఫ్రెండ్ బైక్ పై వెళ్తుంటే వాళ్ళ నాన్న ప్రతాప్ చూస్తాడు. తన వెంటే ఫాలో అవుతాడు కానీ డైవర్ట్ అవుతాడు. దాంతో తన ఫ్రెండ్ చెప్పినట్లు తన కూతురు కూడా ఎవరినైనా లవ్ చేస్తుందానన్న టెన్షన్ మొదలవుతుంది. మరొకవైపు మాధవ భోజనానికి అన్నీ సిద్ధం చేసి తన తమ్ముళ్ళని పిలుస్తాడు. మనలో మనం ఎందుకు కొట్టుకుంటున్నాము.. మనకి ఎవరు సపోర్ట్ లేదు.. మనమే తోడుగా ఉండాలని మాధవ చెప్తాడు.
అది కాదు అన్నయ్య.. నాన్న సక్రమంగా ఉంటే మనం కూడా బాగుండేవాళ్ళం కదా.. సొంత వాళ్ళు కూడా అలా మాట్లాడుతుంటే బాధగా ఉండదా.. మాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ నీకు అవ్వాలి అన్నయ్య అని మాధవతో కేశవ అంటాడు. నలుగురు అన్నదమ్ముళ్లు ఎమోషనల్ అవుతారు. కన్నా పక్కకి వెళ్లి బాధపడుతుంటే మాధవ వెళ్లి దైర్యం చెప్తాడు. మరొకవైపు మహా వాళ్ళ ఫ్యామిలీ భోజనం చేస్తుంటారు. సర్టిఫికెట్ తీసుకొని వచ్చావా అని ప్రతాప్ తన కూతురు మహాని అడుగుతాడు. తను టెన్షన్ పడుతూ క్లర్క్ లేడు నాన్న అని చెప్తుంది. మహా అబద్దం చెప్తుందని అతనికి అర్థం అవుతుంది. ఆ తర్వాత ఒకతనికి ఫోన్ చేసి ప్రొద్దున పెళ్లి సంబంధం అన్నారు కదా వాళ్ళని రమ్మని చెప్పండి అని ప్రతాప్ మాట్లాడుతుంటే.. తన భార్య విని ప్రొద్దున.. ఇప్పుడే పెళ్లి వద్దన్నారు మరి ఇప్పుడు ఏంటని అడుగుతుంది. నా ఫ్రెండ్ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంది.. అలా నా కూతురు చేస్తుందని కాదు.. ఆ వయసు అలాంటిది.. అందుకే జాగ్రత్తపడాలని ప్రతాప్ అంటాడు.
మరొకవైపు పెళ్లి సంబంధం చూసే అతను చక్రికి ఫోన్ చేసి మీ అన్నయ్య పెళ్లిచూపులకి రాలేదని అడుగుతాడు. ఈ రోజు మా అన్నయ్య బిజీ ఉన్నాడు. మరొకరోజు సెట్ చెయ్యండి అని చక్రి చెప్తాడు. మరుసటిరోజు మహా పెళ్లిచూపులకి ఏర్పాట్లు జరుగుతాయి. ఆ విషయం తెలిసి మహా వద్దని అంటుంది కానీ తన మాట ఇంట్లో ఎవరు వినరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



