అనుపమ మాటలకి కంగుతిన్న రిషి!
on Nov 30, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‘గుప్పెడంత మనసు’. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-933లో... వసుధారపై పడ్డ నింద తప్పని రిషి రుజువు చేస్తాడు. దాంతో వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత పెద్ద సమస్యని మీరు పరిష్కరించారు. నాకు చాలా భయం వేసిందని వసుధార అనగానే.. నీకు భయమా? పొగరికి బ్రాండ్ అంబాసిడర్ వి. నీకు భయమేంటని రిషి అంటాడు.
నేను కూడా ఒక అమ్మాయినే కదా సర్.. ఇంకా ఆ అనుపమగారు అన్న మాటలకు తల తీసేసినట్టు అయిందని వసుధార బాధగా చెప్తుంటే.. తనకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. బెయిల్ పై తీసుకొని వచ్చిందని రిషి చెప్తాడు. నీకు నీ జీవితాన్ని ఎప్పటికి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండ నేను అడ్డుగా ఉంటానని వసుధారకి రిషి ప్రేమగా చెప్తాడు. మరొకవైపు మహేంద్ర చాలా హ్యాపీగా అనుపమకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. మరొకవైపు వసుధార జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకొని అతను ఇదంతా చేయించింది. ఆ వీూR అని చెప్పాడు కదా ఆ వీూRకి అంత తెలివి లేదు. నాకు అతను కాదేమో అనిపిస్తుందని రిషితో వసుధార అంటుంది. అది ఎవరైనా వదిలి పెట్టేది లేదని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక టీ స్టాల్ దగ్గర ఆగుతారు. వసుధార టీ స్టాల్ అతన్ని పక్కకి జరగమని చెప్పి తనే టీ చేస్తోంది. ఆ తర్వాత టీ తాగిన రిషి బాగుందని అంటాడు. టీ స్టాల్ అతను వచ్చి.. మీరు రిషి సర్ కాదా మా పిల్లలు మీ గురించి గొప్పగా చెప్తారు. మీరు గ్రేట్ సర్. ఒక సెల్ఫీ కావాలి అంటూ రిషి వాళ్ళతో అతను సెల్ఫీ తీసుకుంటాడు.
మరోకవైపు మహేంద్ర దగ్గరకి అనుపమ వస్తుంది. మహేంద్ర గర్వంగా నా కోడలు ఏం తప్పు చెయ్యలేదని రిషి నిరూపించాడు. తను జగతి స్టూడెంట్ తప్పు చెయ్యదని మహేంద్ర చెప్తాడు. అప్పుడే రిషి, వసుధారలు వస్తారు. రిషి కూడా వసుధార ఏం తప్పు చెయ్యలేదని నిరూపణ అయిందని అనగానే.. నీ భార్య విషయంలో ఒక్క రోజులోనే ఏం తప్పు చెయ్యలేదని నిరూపించావ్ కానీ జగతిని ఎవరు చంపారో ఇంకా తెలుసుకోలేనుపోతున్నావ్. ఇంత లైట్‌గా ఎలా తీసుకుంటున్నావని రిషితో అనుపమ అనగానే.. మీరు అలా మాట్లాడకండి. నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు మీ ఫ్రెండ్ గురించి అంత ఉంటే, తను నా కన్నతల్లి. నాకు ఇంకా ఎంత బాధ్యత ఉంటుంది. నేను త్వరలోనే తెలుసుకుంటానని రిషి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



