పెళ్ళికి ముందు అతనికి గతం గుర్తుకు రానుందా?
on Nov 30, 2023
స్టార్ మా టీవీలో ప్రసామవుతున్న సీరియల్ ‘కృష్ణ ముకుంద మురారి’. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -327 లో.. ముకుంద కావాలనే మురారితో కలిసి ఉన్న ఫోటోస్ తీసుకొని వచ్చి మురారికి చూపిస్తుంది. మనం ప్రేమించుకున్నప్పటి ఫోటోస్ ఇవి అని అనగానే మురారి షాక్ అవుతాడు. నీ రూపం మార్చి నువ్వు ఇలా కావడానికి కారణం అయి పుణ్యం కాదు పాపం మూట కట్టుకున్నారని మురారీతో ముకుంద అంటుంది. ఆ తర్వాత మురారి డిస్సపాయింట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మరొకవైపు మధు, గౌతమ్ డ్రిరక్ చేస్తూ కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. కృష్ణ రిస్క్ చేసి నిన్ను, నందుని కలిపిందని మధు అనగానే.. అవును ఇప్పుడు కృష్ణకి మనం హెల్ప్ చెయ్యలేమా అని గౌతమ్ అంటాడు. పెద్దమ్మకి ఎదరు తిరగలేం. కన్విన్స్ చెయ్యడం తప్పని మధు అంటాడు. మరొకవైపు మురారికి నిద్రలో గతం గుర్తుకువచ్చినట్లు ఒక్కసారిగా లేచి కృష్ణ అంటాడు. అప్పుడే ముకుంద విని గతం గుర్తుకు వచ్చిందా అని టెన్షన్ పడుతుంది. ఇందాక నేను ఏం అని అరిచానని ముకుంద అనగానే.. అమ్మ అని అరిచావని అబద్ధం చెప్తుంది. నన్ను ఎవరో సర్ అని అబ్బాయి అని పిలిచినట్లు అనిపించిందని ముకుందతో మురారి చెప్తాడు. ఆ తర్వాత మురారిని ముకుంద డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు భవానిని పట్టించుకోకుండా మురారి వెళ్తుంటే.. ఎక్కడికి అని అడుగుతుంది. కృష్ణ దగ్గరకు అని చెప్పి వెళ్లిపోతాడు. పూర్తిగా వాళ్ళ ఉచ్చులో పడకముందే మురారి, ముకుందలకి పెళ్లి చెయ్యాలని భవాని అనుకుంటుంది. ముకుందకి మధు, రేవతి కౌంటర్ వేస్తుంటారు.
కాసేపటికి కృష్ణ దగ్గరకు మురారి వెళ్లి.. రాత్రి నిద్రలో గతం గుర్తుకు వచ్చినట్లు అనిపించింది. ఎవరో సర్ అంటున్నట్టు అని మురారి అనగానే.. గుర్తుకు తెచ్చుకోండి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణ. వాళ్ళ మాటలన్నీ ముకుంద వింటుంది. మరొకవైపు భవాని తన ఫ్రెండ్ తో.. ముకుంద, మురారిల పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఒక మాట శ్రీనివాస్ అన్నయ్య కూడా చెప్పి కనుక్కోండి అని రేవతి అనగానే.. ఎందుకు అతను పెళ్లికి అడ్డు చెప్తారన్న ఆశనా? అయినా కూతురు జీవితం హ్యాపీగా ఉంటుందంటే ఎందుకు వద్దు అంటారని భవాని అంటుంది. తరువాయి భాగంలో.. పంతులిని భవాని పిలిచి ముకుంద, మురారీల పెళ్లి ముహూర్తం పెట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



