పర్సనల్ ఫోటోలు బయటకి ఎలా వచ్చాయి.. రతిక ముందే ప్లాన్ చేసిందా?
on Sep 21, 2023
రాహుల్ సిప్లిగంజ్.. ప్రస్తుతం క్రేజ్ ఉన్న సింగర్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని తను పాడిన నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో తన రెగ్యులర్ అప్డేట్స్ ని షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉండే రాహుల్ సిప్లిగంజ్.. షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
తన పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్. " నాకొక ప్రశ్న ఉంది. ఆరు సంవత్సరాల తర్వాత తన ఫోన్ లో నుండి పర్సనల్ గా దిగిన ఫోటోలు ఎలా బయటకొచ్చాయి. లోపలికి వెళ్ళేముందే ప్రీప్లాన్ చేసుకొని వెళ్ళారా? మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. అది అబ్బాయి అయిన అమ్మాయి అయిన నేనెవరి లైఫ్ ని నాశనం చేయలేదు. ప్రతీ ఒక్కరు విజయం కోసం కష్టపడుతుంటారు. ప్రతీ ఒక్కరికి గతం ఉంటుంది. అది తెలుసుకోకుండా అంచనా వేయకూడదు. నన్ను అర్థం చేసుకున్నవాళ్ళకి థాంక్స్. నా గురించి నెగెటివ్ ని షేర్ చేయాలనుకున్నవారికి ఆల్ ది బెస్ట్' అంటూ ఈ పోస్ట్ లో రాసుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.
అసలు విషయానికొస్తే రతిక, రాహుల్ సిప్లిగంజ్ గతంలో ప్రేమికులని, కొన్ని నెలలపాటు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా బిగ్ బాస్ సీజన్-7 మొదలైన వారం నుండి ఈ వార్త బయటకొచ్చింది. రతికరోజ్ ని ప్రమోట్ చేసే PR బ్యాచ్.. రాహుల్, రతిక కలిసి దిగిన ఫోటోలని నెట్టింట పోస్ట్ చేస్తున్నారని రాహుల్ సిప్లిగంజ్ అంటున్నాడు. అయితే ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని, ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో పాపులారిటీ కోసం తనని వాడుకోవడం కరెక్ట్ కాదని రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో రతికని ఇప్పటికే రాధిక అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొదటి వారం నుండి పల్లవి ప్రశాంత్ తో ప్రేమ అంటూ డ్రామాలు చేసి, ఇప్పుడు ప్రిన్స్ యావర్ తో ఫేక్ ఫీలింగ్స్ ను చూపిస్తుంది రతిక. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు రతికపై నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఈ పోస్ట్ తో రతికని ఏ రేంజ్ లో ట్రోల్స్ చేస్తారో చూడాలి మరి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
