కావ్య కాంట్రాక్ట్ పూర్తిచేయగలదా.. ఆ రౌడీలు ఏం చేయనున్నారు?
on Sep 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -207 లో.. కావ్యని తీసుకొని వెళ్ళడానికి రాజ్ తన అత్తింటికి వస్తాడు. రాజ్ రావడం చూసిన కావ్య.. మీరు వచ్చారా నేను రావడం లేట్ అవుతుందని తాతయ్యకు చెప్పానని కావ్య అనగానే.. లేట్ అవుతుందనే నేను నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చానని రాజ్ అంటాడు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిలు రాజ్ నీ ఇంట్లోకి పిలుస్తారు. ఆ తర్వాత కావ్య బొమ్మలకు కలర్స్ వేస్తుంటే కావ్య దగ్గరే రాజ్ కూర్చొని ఉంటాడు. కృష్ణమూర్తి విగ్రహల దగ్గరికి వెళ్తున్నానని వెళ్తాడు.
రాహుల్ పంపిన రౌడీలు విగ్రహలు తీసుకొని వెళ్ళడానికి వస్తారు. మరొక వైపు కృష్ణమూర్తి ఇంకొక అబ్బాయి విగ్రహల దగ్గరే ఉంటారు. మరొక వైపు కావ్య కలర్స్ వేస్తుంటే కావ్యనే చూస్తుంటాడు రాజ్. ఆ తర్వాత ఈ రోజు మీరు ఇక్కడే ఉంటారా కాంట్రాక్టు పూర్తి అవుతుంది. రేపు మీతో గుమ్మడి కాయ కొట్టించాలని మా వాళ్ళు అనుకుంటున్నారు. కాంట్రాక్టు మీ వల్లే వచ్చింది కాబట్టి మా వాళ్ళు హ్యాపీగా ఉంటారని రాజ్ తో కావ్య అనగానే.. సరే అని రాజ్ అంటాడు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో.. మీరు కావ్య ఏం చెప్తే అది చెయ్యకండి. ప్రతిసారీ పుట్టింటికి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారని సీతారామయ్యతో అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత సీతరామయ్య రాజ్ కి ఫోన్ చేస్తాడు. కాసేపు మాట్లాడిన రాజ్.. ఈ రోజు ఇంటికి రావడం లేదని చెప్పగా.. సరేనని సీతారామయ్య చెప్తాడు. అపర్ణ కూడా రాజ్ మాటలు వింటుంది.
ఆ మాటలు విన్న అపర్ణ.. రాజ్ అక్కడికి వెళ్తే వాడిని మార్చేస్తారని అనుకుంటుంది. ఆ తర్వాత రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. ప్లాన్ ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతుంది. మరొకవైపు కావ్య, కనకం, అన్నపూర్ణ, అప్పు అందరు కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్ని కూడా రాజ్ వింటాడు. ఆ తర్వాత పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ సంతోషంగా ఉంటారు. కృష్ణమూర్తి చేసిన విగ్రహాల దగ్గరికి రాహుల్ పంపిన రౌడీలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
