రచ్చ రవి: నేను తాగను... తాగబోను
on Jun 13, 2025
సింగర్ మంగ్లీ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో భాగంగా డ్రగ్స్, గాంజా వంటివి సేవిస్తున్నారంటూ న్యూస్ వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ నేమ్స్ కూడా వార్తల్లో వినిపించాయి. ఐతే అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివరామకృష్ణ, అనుచరుడు దామోదర్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు పెట్టారు. ఇక ఇందులో సెలబ్రిటీస్ పేర్లలో రచ్చ రవి పేరు కూడా వచ్చింది. దాంతో అతను రియాక్ట్ అయ్యాడు. "హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చ రవి..నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఫోన్ చేసి నువ్వు వైరల్ అవుతున్నావ్ అంటే నా పేరు పెరుగుతోంది..నాకో నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరకు వస్తాయనుకున్నా...తీరా న్యూస్ చూస్తే తెలిసింది. ఉన్న అవకాశాలు పోగొట్టేలా ఉన్నాయి. ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి డే అండ్ నైట్ షూట్స్ ఉండడం వలన నేను ఇంటికి దూరంగా ఉంటున్నాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. కాబట్టి అప్ డేట్స్ లేట్ గా తెలుస్తున్నాయి. ఇటీవల బర్త్ డే పార్టీ మాదక ద్రవ్యాల మద్యలో రచ్చ రవి అని స్ప్రెడ్ అవుతూ ఉంది.
నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కడినే రచ్చ రవిని...నా లాగ ఇంకోడు లేడు, రాడు.. అక్కడ ఉన్న రచ్చ రవి నేను కాదు. నాకు తెలీదు. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా" అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని రిలీజ్ చేసాడు. "నేను తాగను... తాగబోను...నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి." అనే కాప్షన్ తో పాటు రెండు ప్రముఖ టీవీ ఛానెల్ పేర్లను కూడా హ్యాష్ టాగ్స్ రూపంలో పెట్టాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
