Brahmamudi: యామినికి షాకిచ్చిన కావ్య.. తన చేయి పట్టుకున్న రాజ్!
on Jun 13, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -746 లో....రాహుల్, మా అత్త రుద్రాణి అక్కడికి వస్తే మీ ప్లాన్ చెడగొడుతారు.. వాళ్ళు రాకుండా నేను చూస్తాను.. మీరు వెళ్ళండి అని ఇందిరాదేవి వాళ్ళతో స్వప్న చెప్తుంది. ఆ తర్వాత కావ్య మంచిగా రెడీ అయి రావడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. నేను ఎలా ఉన్నానని కావ్య అడిగితే.. అక్కడ నీ భర్తకి వేరొకరితో పెళ్లి జరుగుతుందని ఇందిరాదేవి కోప్పడుతుంది. అయిన కావ్య అవేం పట్టించుకోదు.
మరొకవైపు కావ్య కోసం రాజ్ వెళ్తుంటే.. ఎక్కడికి బావ ఇప్పుడు నలుగు పెట్టుకోవాలని యామిని అంటుంది. కళావతి దగ్గరికి అని రాజ్ అనగానే అప్పుడే కావ్య ఫ్యామిలీతో ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి రాజ్ షాక్ అవుతాడు. బావ వాళ్ళని నేనే పిలిచానని యామిని అంటుంది. పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అని యామిని అనగానే.. అంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటామని అని కావ్య అంటుంది. మరొకవైపు రాహుల్, రుద్రాణి బయటకు రాకుండా స్వప్న లాక్ వేస్తుంది.
ఆ తర్వాత నలుగు పెట్టేటప్పుడు.. అది ఆగిపోయేలా అప్పు, కళ్యాణ్ ప్లాన్ చేస్తారు. అలా ప్రతీ దాంట్లో యామిని ఫెయిల్ అయ్యేలా ఇందిరాదేవి, అపర్ణ, అప్పు, కళ్యాణ్ సెట్ చేస్తారు. తరువాయి భాగంలో తనని పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని యామిని బెదిరించిందని.. అందుకే పెళ్ళికి ఒప్పుకున్నానని రాజ్ అంటాడు. అలా కాదు మీకు ఎవరైనా నచ్చితే అప్పుడు చేసుకోవాలని కావ్య అనగానే.. కావ్య చెయ్ పట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
