వన్ సైడ్ లవ్ కి, టు సైడ్ లవ్ కి కొత్త అర్ధం చెప్పిన నూకరాజు
on Dec 11, 2022

జబర్దస్త్ ప్రతీ వారం కొత్త కొత్త స్కిట్స్ తో డిఫరెంట్ గా అలరిస్తూ సాగుతోంది. ఇక ఇప్పుడు రాబోయే వారం జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. వన్ సైడ్ లవ్ కి, టు సైడ్ లవ్ కి డిఫరెన్స్ ఏమిటి అని నూకరాజుని తన టీమ్ కమెడియన్ అడిగేసరికి "వన్ సైడ్ లవ్ అంటే జబర్దస్త్ లో యాంకరింగ్ లాంటిది ఒకరికి నచ్చితే చాలు, అదే టు సైడ్ లవ్ అంటే జడ్జిమెంట్ లాంటిది ఇద్దరికీ నచ్చాలి..." అని ఆన్సర్ ఇచ్చాడు. దాంతో ఇంద్రజ ఎంట్రీ ఇచ్చి టీమ్ మెంబెర్స్ కి నచ్చాలి, డైరెక్టర్స్ కి నచ్చాలి అని కౌంటర్ వేసింది.
ఇక తాగుబోతు రమేష్ స్కిట్ కూడా వెరైటీగా ఉంది.. ఇంట్లో భర్త తన సెల్ కి పెట్టుకునే పాస్వర్డ్ చెప్పమని భార్య అడిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చేసి చూపించారు. తాగుబోతు రమేష్ సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చేసరికి అంబులెన్సు కి ఫోన్ చేయమని తన కమెడియన్ వైఫ్ కి చెప్పి ఆమె చేతికి సెల్ ఇచ్చాడు. ఇక ఆమె పాస్వర్డ్ చెప్పండి అని అడిగేసరికి గుండెనొప్పి తగ్గిపోయిందిలే అని చెప్పి సెల్ లాగేసున్నాడు...ఇలా తాగుబోతు రమేష్ తన స్కిట్ తో ఆడియన్స్ ని అలరించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



