ఎవరికీ తెలియకుండా వాడి ప్యాంట్ తెచ్చేసా!
on Dec 10, 2022

చమ్మక్ చంద్ర జబర్దస్త్ కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాలకూ సుపరిచితుడే. ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తూ ఫామిలీ ఆడియన్స్ కి అందులో గృహిణులకు మరింత దగ్గరయ్యాడు. అలాంటి చమ్మక్ చంద్ర తన లైఫ్ లో ఒక చిలిపి పని చేసాడట..ఆ చిలిపి పని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
"నేను అప్పుడు నాలుగవ తరగతి చదువుతున్నాను. మా అత్త కొడుకు ఏడవ తరగతి చదువుతున్నాడు. అప్పటికి మా ఇంట్లో లాగూలు మాత్రమే వాడుకోమనే వాళ్ళు నన్ను..మా అత్తా కొడుక్కు ప్యాంట్ ఉండేది. నాకు లాగూ కంటే ప్యాంట్ అంటే చాలా ఇష్టం. మా అమ్మానాన్నలు నాకు ప్యాంట్ కుట్టించలేదు, వాడికి మాత్రం ప్యాంట్లు కూడా కొట్టించారు మా అత్తా వాళ్ళు. అలా ఇద్దరం కామారెడ్డిలో చదువుకునేవాళ్ళం. అప్పుడు నేను వాడి ప్యాంట్ ఒకదాన్ని తెలియకుండా ఇంటికి తెచ్చేసుకుని వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నా. కట్ చేస్తే రెండు రోజుల తర్వాత కామారెడ్డి నుంచి అత్త మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ప్యాంట్ తీసి దాచేసాను. ఇక ఫైనల్ గా ఆ విషయం మా ఇంట్లో చెప్పేసరికి మా అమ్మ నన్ను కొట్టి ఆ ప్యాంట్ ఇచ్చేయమని చెప్పింది. ఇక వాడి ప్యాంట్ వాడికి ఇస్తూ నేను పడిన బాధా చాలా ఉంది. లైఫ్ లో మరిచిపోలేని విషయం ఇది. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను " అని సరదాగా సంఘటన చెప్పి నవ్వించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



