Illu illalu pillalu : విశ్వ, భద్రవతి ప్లాన్.. రామరాజుకి షాక్ తగలనుందా!
on Jan 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -372 లో..... ఎంగేజ్ మెంట్ పూర్తయ్యాక అబ్బాయి వాళ్ళు వెళ్తుంటే.. వాళ్ళతో పాటు రామారాజు కుటుంబం మొత్తం వస్తుంది. ఇకనుండి నువ్వు ఈ ఇంట్లో బిడ్డవి మాత్రమే కాదు.. మా ఇంట్లో బిడ్డవి కూడా అని అమూల్యతో వనజ అంటుంది. నా కూతురు మీ ఇంట్లోకి కోడలుగా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని రామరాజు అంటాడు. మాక్కూడా అని వనజ అంటుంది. మీరు నీకు అని తిరుపతి అబ్బాయిని అడుగుతాడు. అందరి కంటే ఎక్కువ నేనే హ్యాపీగా ఉన్నానని అబ్బాయి అంటాడు.
అదంతా పై నుండి విశ్వ, భద్రవతి చూస్తారు. అమూల్య చెయ్ జారిపోతుంది. అత్తా అన్నీ ప్రయత్నాలు చేసాను కానీ ఎంగేజ్ మెంట్ ఆపలేకపోయానని విశ్వ అంటాడు. ఎంగేజ్ మెంట్ కాదు పీటలపై పెళ్లి ఆగాలి.. అప్పుడే కదా వాడి పరువుపోయేదని భద్రవతి, విశ్వకి ఏదో ప్లాన్ చెప్తుంది. అది విని ఆ అమూల్యని పెళ్లిపీటలు ఎక్కకుండా నేను చూస్తానని విశ్వ అంటాడు. మరొకవైపు సాగర్ జాబ్ కి ట్రై చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఒకతను ఫోన్ చేసి ఇరవై లక్షలు కావాలని అడుగుతాడు. వారం రోజుల టైమ్ అని చెప్తాడు. ఆ తర్వాత సాగర్ ని రామరాజు పిలిచి వనజ వాళ్ళు అమ్మాయికి గోల్డ్ చేపించమని ఇచ్చిన డబ్బు సాగర్ కి ఇచ్చి ఇవి బ్యాంకులో వేసిరా ఇది నాన్న పరువు అనుకో జాగ్రత్త అని మరి మరీ చెప్పి పంపిస్తాడు. మరొకవైపు అ ఫోటోస్ ఎలా వచ్చాయని నర్మద ఆలోచిస్తుంది.
ప్రేమ కూడా వస్తుంది. పెళ్లి ఆపాలని చూసే అవసరం ఒక మీ అన్నయ్యకి ఉంది. అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇదంతా చేస్తున్నాడు. ఆ వల్లి ఇదంతా చేసి ఉంటుందని నర్మద అనగానే నాకు అలాగే ఉందని ప్రేమ అంటుంది. అదంతా శ్రీవల్లి వింటుంది. ఆ తర్వాత ధీరజ్ అన్నమాటలు ప్రేమ గుర్తుచేసుకొని కోపంగా ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



