Brahmamudi : మినిస్టర్ షాక్.. ఆమె బిడ్డని కావ్య కనిపెడుతుందా!
on Jan 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -933 లో.. పాపని తీసుకొని వచ్చి కావ్యకి డాక్టర్ ఇవ్వగానే తను నా బిడ్డ కాదని అంటుంది. అందరు షాక్ అవుతారు. ఏంటి కావ్య అలా మాట్లాడుతున్నావ్.. అలా అనకూడదని డాక్టర్ కోప్పడుతుంది. నేను మొదటి సారి ఎత్తుకున్నప్పడు నాకు అమ్మ ఫీలింగ్ వచ్చింది. ఈ పాపని ఎత్తుకుంటే రావడం లేదు. ఇంకా నేను నా బిడ్డని చూసినప్పుడు.. తన చేతికి పుట్టుమచ్చ కూడా ఉంది. ఈ పాపకి లేదు ఎవరో మార్చేశారని కావ్య ఏడుస్తుంది.
నువ్వేం మాట్లాడుతున్నావ్.. ఎవరు మారుస్తారు.. కాసేపు పడుకోమని డాక్టర్ కోప్పడుతుంది. ఏవండి.. ఈ బిడ్డ మన బిడ్డ కాదండి అని రాజ్ తో కావ్య అంటుంది. మన బిడ్డే.. నువ్వు ఎందుకు అలా అంటున్నావని రాజ్ అంటాడు. మరొకవైపు పాపని ఎత్తుకొని మినిస్టర్ ముద్దాడుతుంటే తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి మీతో మాట్లాడాలని అంటుంది. రుద్రాణిని తులసికి పరిచయం చేస్తాడు మినిస్టర్. మినిస్టర్, రుద్రాణి బయటకు వస్తారు. మీరు అర్జెంటుగా డిశ్చార్జ్ అయి వెళ్ళండి. ఆ కావ్య తన దగ్గర ఉన్న పాప తన బిడ్డ కాదని తెలుసుకుందని అనగానే మినిస్టర్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత కావ్య ఎందుకు అలా ప్రవర్తిస్తుందోనని అందరు అనుకుంటారు. మరొక పక్క కావ్య తన బిడ్డ కోసం వార్డ్ లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఆ విషయం నర్స్ వచ్చి చెప్పగా అందరు కావ్య దగ్గరికి వెళ్తారు.
డాక్టర్ వచ్చి కావ్యపై కోప్పడుతుంది. అర్జెంట్ గా కావ్యని తీసుకొని వెళ్లిపోండి అంటుంది. ఆ తర్వాత డాక్టర్ తులసి దగ్గరికి వస్తాడు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని తులసి అడుగుతుంది. బిడ్డని మార్చేసిన విషయం డాక్టర్ కి తెలియదు.. ఇంకా పాపకి ప్రాబ్లమ్ ఉంది కదా అనుకొని ఇంకా టైమ్ పడుతుందని డాక్టర్ అంటాడు. అప్పుడే మినిస్టర్ వచ్చి మేం డిశ్చార్జ్ అవుతాం.. అన్నీ సిద్ధం చెయ్యండి అని అంటాడు. డాక్టర్ కి ఏం అర్థం కాదు.. దాంతో డాక్టర్ ని బయటకు తీసుకొని వెళ్లి మేం వెళ్ళిపోతామని మినిస్టర్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్ ని డాక్టర్ పిలిచి మాట్లాడుతుంది. తను ఒత్తిడిలో ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు.. పిల్లలు చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు.. మీరు తనని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని రాజ్ తో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



