Bigg Boss 9 Telugu weekend promo : భరణికి ఇచ్చి పడేసిన నాగ్.. ప్రేక్షకుల మాటలకి బిత్తరపోయిన రేలంగి మావయ్య!
on Oct 11, 2025
.webp)
బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో రానే వచ్చింది. బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో కోసం అభిమానూలు ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. కానీ ప్రోమో ఎప్పుడు ఈవినింగ్ వస్తుంది. ఇలా ఇంత త్వరగా రావడం ఇదే మొదటి సారి. నాగార్జున మాస్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే బెడ్ టాస్క్ లో నువ్వు చేసింది కరెక్టేనా అని తనూజ పై నాగ్ సీరియస్ అయ్యాడు.
టాస్క్ లో ముందు ఆడపిల్లలని తోసేద్దామనుకున్నావ్ అలా కాకుండా అందరి తరుపున పోరాడి ఉంటే చివరకు నీ దాకా వచ్చి ఉండేది కాదు కదా అని నాగార్జున అడిగాడు. ఆట నుండి ముందు వెళ్ళిపోయిన సంజన మీరు అందరు కలిసి ఆడండి విడివిడిగా ఆడకండి అని చెప్పింది. అయిన వినలేదు. భరణి, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ నిన్ను తియ్యరనుకున్నావా.. నీ విషయం లో చాలా డెలికేటెడ్ గా ఉన్న భరణి.. శ్రీజని అలా తియ్యడం కరెక్టా? అని తనూజని కన్ఫ్యూషన్ లో పడేసాడు నాగార్జున. ఇప్పుడు దివ్య, తనూజ ఉన్నారు.. భరణి ఎవరికి సపోర్ట్ చేస్తాడని దివ్యని నాగార్జున అడుగుతాడు. తనూజకి సపోర్ట్ చేస్తాడు .. ఎందుకు అంటే నేను అర్థం చేసుకుంటానని దివ్య అనగానే అంటే తనూజ అర్థం చేసుకోదా అని నాగార్జున అంటాడు.
ఫ్లోరా కి నాగార్జున బెడ్ టాస్క్ కి సంబంధించిన వీడియోని చూపిస్తాడు. భరణి బెడ్ పై నుండి ఫస్ట్ కింద పడతాడు కానీ ఫ్లోరా డీమాన్ పవన్ పడ్డాడని సంచాలక్ గా నిర్ణయం తీసుకుంటుంది. అది అన్ ఫెయిర్ అని నాగార్జున చెప్తాడు. నేను స్వార్థం గా ఆలోచించాను సర్ తప్పు నాదే అని భరణి గిల్టీగా ఫీల్ అవుతాడు. బెడ్ పై నుండి కాదు.. మా దృష్టిలో నుండి కూడా కింద పడ్డావని నాగార్జున అంటాడు. వారంలో తప్పు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు.. నీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక అమ్మాయి ఇక్కడ ఉంది. తను నీ గురించి ఏం అంటుందో విను అని నాగార్జున చెప్తాడు. మీ గేమ్ కనపడుతలేదు.. బాండింగ్ కనపడుతుంది.. అసలు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచబుద్ది అవ్వడం లేదని ఆ అమ్మాయి భరణి మొహంపై చెప్పేసింది. మరి భరణి ఎలా ఆడతాడు..నాగార్జున ఇంకా ఎవరిని ఏం అన్నాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



