Illu illalu pillalu : ధీరజ్ కోసం ప్రేమ తపన.. బతుకమ్మ ఆటలో ఇరు కుటుంబాలు!
on Oct 11, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -286 లో.. నర్మద పేరెంట్స్ ని తీసుకొని వచ్చి సాగర్ నర్మదకి సర్ ప్రైజ్ ఇస్తాడు. నర్మద తన పేరెంట్స్ ని చూసి సంతోషపడుతుంది. అమ్మా మీరేలా వచ్చారని నర్మద అడుగుతుంది. సాగర్ వచ్చి.. నా వల్ల మీ కూతురిని బాధపెట్టకండి అని రిక్వెస్ట్ చేసాడు.. దాంతో మీ నాన్న కూడా ఏం అనలేదని నర్మద వాళ్ళ అమ్మ అంటుంది. ఆ తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. నువ్వు మా కుటుంబం కోసం ఏంత చేస్తున్నావ్.. ఈ మాత్రం చేయలేనా అని సాగర్ అంటాడు.
ఆ తర్వాత అందరు బతుకమ్మ ఆడుతారు. వేదవతిని ప్రేమ తీసుకొని వెళ్లి తన వాళ్ళ దగ్గర ఆడేలా చేస్తుంది. ఆ తర్వాత నర్మద వాళ్ళ అమ్మని ప్రేమ తీసుకొని వచ్చి నర్మద దగ్గర ఆడెలా చేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కి నీ ప్రేమ విషయం చెప్పమని ప్రేమతో నర్మద చెప్తుంది. అక్క నువ్వే హెల్ప్ చెయ్యాలని ప్రేమ అంటుంది. ఐ లవ్ యూ అని ఒక పేపర్ పై రాసి ఒక పాప కి ఇచ్చి ధీరజ్ కి ఇచ్చి ఆ అక్క పంపిందని చెప్పు అని ప్రేమని చూపిస్తుంది. ఆ పాప వెళ్లి పేపర్ ఇస్తుంది. ఎవరు ఇచ్చారని ధీరజ్ అడుగుతాడు. ఆ పాప ప్రేమని చుపిస్తుంది. కానీ వెనకాల ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్య పంపింది అనుకొని ధీరజ్ తన దగ్గరికి వెళ్లి.. ఇది రాసింది నువ్వేనా అనీ అడుగుతాడు. నువ్వే రాసి ఇలా నన్ను అంటున్నావని ఐశ్వర్య సిగ్గుపడుతుంది. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటే అని ఐశ్వర్యతో గొడవ పడుతుంది. నర్మద వచ్చి గొడవ ఆపుతుంది. ప్రేమతో సైలైంట్ గా మాట్లాడుతుంది నర్మద. ఆ పేపర్ నేను రాసి నువ్వు ఇచ్చావని పంపించాను కానీ ఐశ్వర్య అనుకున్నాడని ప్రేమతో నర్మద అంటుంది.
మరొకవైపు సేనాపతి, రామరాజు కలిసిపోయారు కదా మీ ప్రేమ మీ ఇంట్లో బతుకమ్మ తీసుకొని వచ్చింది కదా అని ఒకతను సేనాపతితో అంటాడు. వాడితో కలవడం ఏంటి వాడే సిగ్గు లేకుండా వాళ్ళని అడ్డు పెట్టుకొని మాతో కలవాలని చూస్తున్నాడని సేనాపతి అంటాడు. మరోవైపు రామరాజు తన ఇద్దరు కోడళ్ళని చూసి.. ఈ ఇద్దరు కోడళ్ళు నా పరువు తీసేందుకే ఉన్నారని అనుకుంటాడు. అదే విషయం వేదవతితో చెప్తాడు. అదంతా విన్న శ్రీవల్లి.. రామరాజుకి వచ్చి ఇంకా కోపం పెరిగేలా మాట్లాడుతుంది. అదంతా ప్రేమ, నర్మద వింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



