`కార్తీకదీపం` : లాయర్ సురేష్‌తో కలిసి మోనిత కొత్త కుట్ర
on Nov 26, 2021

గత కొంత కాలంగా బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న సీరియల్ `కార్తీక దీపం`. వంటలక్క పాత్ర ధారి ప్రేమి వైధ్యనాథ్‌ని స్టార్‌ని చేసింది. ఇక డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ ఓంకార్‌ని కూడా పాపులర్ స్టార్‌గా మార్చింది. ఇప్పటి వరకు 1206 ఎపిసోడ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఈ శుక్రవారం 1207వ ఎపిసోడ్‌లోకి ఎంటరవుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర నాటకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.
బారసాల సాక్షిగా మోనిత కడుపు వెనకున్న కుట్రని బయటపెట్టి కళ్లు బైర్లుకమ్మేలా చేసింది దీప. ఇదే సందర్భంగా దీపపై తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టాడు కార్తీక్. కట్ చేస్తే ఈ రోజు ఎపిసోడ్ మరింత ఆసక్తిని రేకెత్తించేదిగా వుంది. ఆ హైలైట్స్ ఏంటో చూద్దాం. దీప , శ్రావ్య ఒకటీమ్, ఆదిత్య, కార్తీక్ ఒకటీమ్‌గా ఏర్పడి పొడుపుకథల పోటీ పెట్టుకుని హ్యాపీగా నవ్వుకుంటుంటారు. పిల్లలు, ఆనందరావు, సౌందర్యలు వాళ్లని చూసి మురిపిపోతుంటారు.
ఇలా కార్తీక్, దీపల కుటుంబం ఆనందంపారవశ్యంలో మునిగితేలుతుంటే మోనిత ఎలా వాళ్ల ఆనందాన్ని దూరంచేయాలా అని మరో కుట్రకు తెరలేపుతుంది. ఇందు కోసం ఓ మాస్టర్ ప్లాన్‌ని రెడీ చేసుకున్న మోనిత వెంటనే లాయర్ సేరుష్‌ని రంగంలోకి దించేస్తుంది. `మీరు ఏ దారిలో వెళతారో నాకు తెలియదు. సురేష్‌గారు డబ్బులు ఎంత ఖర్చయినా ఫరవాలేదు మనం మాత్రం గెలవాలి.. మీరు నా రివేంజ్ తీర్చాలి` అంటుంది మోనిత. ఇంతకీ మోనిత చేసిన ప్లాన్ ఏంటీ? .. దీపని మళ్లీ ఏం చేయబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎనిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



