గుప్పెడంత మనసు` : జగతిని రిషీ ఏమడిగాడు?
on Nov 26, 2021

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ `గుప్పెడంత మనసు`. రిషీ. వసుల ప్రేమకథ నేపథ్యంలో ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలతో సాగుతోంది. గత కొరన్ని వారాలుగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఈ శుక్రవారం 302వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. రిషీ, ఫణీంద్ర, మహేంద్రలతో కలిసి ఇంట్లో కూర్చుని ` ఈరోజే లాస్ట్ ఎగ్జామ్...సెలవుల్లో మెషీన్ ఎగ్జామ్ మరింత డబుల్ చేయాలి` అంటాడు. ఇదే సమయంలో మహేంద్రకు వసు ఫోన్ చేస్తుంది.
పక్కకు వెళ్లిన మహేంద్ర `నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నానమ్మా .. నీతో చాలా మాట్లాడాలి` అంటాడు అయితే రెస్టారెంట్‌లో సాయంత్రం కలుద్దామా` అంటుంది వసు. రిషి వస్తున్నది గమనించి మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. అది గమనించిన రిషీ.. ఏంమీ తనతో మీకు పర్సనల్స్.. అని ప్రశ్నిస్తే.. అబ్బెబ్బే ఏమీ లేదు ఊరికే చేసింది అని కవర్ చేస్తాడు. మీరు రెస్టారెంట్లో కలవాలనుకుంటున్నారని అది తనకు తెలుసని తనకు తెలుసని రిషి మనసులో అనుకుంటాడు.
మరి అనుకున్నట్టుగానే మహేంద్ర, వసు రెస్టారెంట్‌లో కలుసుకున్నారా? .. కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? .. ఆ తరువాత ఏంజరిగింది? .. రిషి వచ్చాడా? .. జగతికి .. రిషి.. వసు గురించి ఏం చెప్పాడు? .. అందుకు జగతి ఎలా రియాక్ట్ అయింది? .. వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



