"కూకూ విత్ జాతిరత్నాలు" స్టార్ మాలో త్వరలో కొత్త కుకింగ్ రియాలిటీ షో
on Jun 15, 2025
బుల్లితెర మీద చాలా షోస్ ఉన్నాయి కానీ కుకింగ్ షోస్ మాత్రం చాలా తక్కువే ఉన్నాయి. రీసెంట్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే పేరుతో ఒక కుకింగ్ షో వచ్చింది. అది పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు ఇంకో కొత్త కుకింగ్ షో రాబోతోంది. అదే "కూకూ విత్ జాతిరత్నాలు" పేరుతో ఒక కొత్త కుకింగ్ షో రాబోతోంది. దీనికి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఇచ్చేసాడు. ఒక మూవీ కోసం కొన్ని నెలలు బుల్లితెరకు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ షోతో ఆడియన్స్ ముందుకు హోస్ట్ గా రి-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ ప్రోమోస్ రెండు రిలీజ్ అయ్యాయి. "మై డియర్ ఫుడీస్ అండ్ బడ్డీస్ ఇక్కడ చిన్న చిన్న స్పూన్ లు కూడా సూపర్ వెపన్స్ గా మారతాయి. ఇప్పటివరకు రుచి చూడని క్యూజిన్స్ చేస్తారు మా నలభీముల కజిన్స్...ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, గోమతి, ఎక్స్ప్రెస్ హరి, సుహాసిని, బిత్తిరి సత్తి వంటి వాళ్లంతా ఈ షోలో వంటలు చేయబోతున్నారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇటాలియన్, అమెరికన్, మెక్సికన్, ఇటాలియన్, జాపనీస్, చైనీస్, థాయ్" అని లీడ్ చెప్తూ ఉండగా రీతూ చౌదరి చేసిన డిష్ ప్లేట్ లోంచి ఎగిరొచ్చి ప్రదీప్ కోట్ మీద పడి మొత్తం ఖరాబైపోతుంది. మొదలయ్యింది జాతిరత్నాల అల్లరి అంటూ ఈ షో ప్రోమో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక మరో ప్రోమోలో చూస్తే సెలబ్రిటీ జడ్జ్ గా అలనాటి అందాల నటి రాధ వచ్చింది. ఒక డిష్ స్మెల్ చూసి "అదే స్మెల్" అంది..ఇక వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ కూడా వచ్చి "అదే టేస్ట్" అన్నాడు. తర్వాత రాధ, సంజయ్ కలిసి "సేమ్ ఫైవ్ స్టార్ హోటల్ లాగే ఉంది" అన్నారు. ఇంతలో బిత్తిరి సత్తి వచ్చి "ఇది అక్కడి నుంచే తెప్పించా" అన్నాడు. రాధా, సంజయ్ ఆశ్చర్యపోయి "నువ్వు చేసింది ఏమిటి" అన్నారు సీరియస్...బిత్తిరి సత్తి ఒక మూల మాడిపోయి డస్ట్ బిన్ లో పడేసిన ఒక డిష్ ని చూపించాడు ఏడుపు ముఖంతో. ఇలా త్వరలో సరికొత్త కుకింగ్ రియాలిటీ షో స్టార్ మాలో రాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



