"కెప్టెన్సీ చేయడం ఎలా" సక్సెస్ బుక్ బై కెప్టెన్ ఇమ్మానుయేల్..
on Jun 15, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వీక్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఒక సెగ్మెంట్ ని పెట్టింది. ఇప్పుడు జరుగుతోంది ప్రీ ఫినాలే కాబట్టి ఫినాలే కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోమని చెప్పింది శ్రీముఖి. ఇందులో మానస్ తేజస్వినికి మల్లెపూలు, కాటుక, కుంకుమ ఇచ్చాడు. తేజు ఐతే ఒక బోటిల్ లో బటర్ మిల్క్ తెచ్చి ఎప్పుడూ కోపంగా ఉంటావు కాబట్టి ఈ బటర్ మిల్క్ తాగి కొంచెం కూల్ అవ్వు అంటూ చెప్పింది. తర్వాత ప్రియాంక జైన్ ఐతే నిఖిల్ కి కళ్ళజోడు ఇచ్చింది, నిఖిల్ ఆమెకు బాక్సింగ్ గ్లోవ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిణి ప్లాస్టర్ ని గిఫ్ట్ గా ఇమ్మానుయేల్ కి ఇచ్చి అతని మూతికి ప్లాస్టర్ వేసేసింది. ఇక ఇమ్ము ఐతే ఒక బుక్ తెచ్చి రోహిణికి ఇచ్చాడు. "కెప్టెన్సీ చేయడం ఎలా" సక్సెస్ బుక్ బై కెప్టెన్ ఇమ్మానుయేల్ అంటూ తానే మూడు రోజులు కష్టపడి రాసనంటూ ఒక బుక్ ని ఇచ్చాడు. ఇక రోహిణి ఐతే ఇమ్ముని చితక్కొట్టింది. "అసలు ఇది బుక్ అన్నావ్ కానీ ఇందులో ఏమీ లేదు కదా" అని శ్రీముఖి అనేసరికి "రోహిణి కెప్టెన్ అయ్యింది కానీ కెప్టెన్సీ చేయడం రావట్లేదు. కెప్టెన్సీ అనేది మనలో ఉండాలి పుస్తకాల్లో ఉంటే రాదు." అంటూ డైలాగ్ వేసాడు. అమరదీప్ ఐతే కొంతమంది అబ్బాయిలు ఫోటోలు తెచ్చి డెబ్జానీకి చూపించాడు. ఆమె మాత్రం అమర్ కి కర్చీఫ్ ఇచ్చి అమ్మాయిలను చూస్తూ సొల్లు కార్చుకోకు అంటూ చెప్పింది. ఇక గాయత్రి ఐతే అంబటి అర్జున్ కి ఒక వాకింగ్ స్టిక్ ఇచ్చింది. అర్జున్ ఆమెకు ఒక దీపం గిఫ్ట్ గా ఇచ్చాడు. సాకేత్ ప్రేరణకు ఒక హ్యాండ్ వాచ్ ఇచ్చాడు. ప్రేరణా అతనికి ఒక బాల్ ఇచ్చింది. అలాగే శ్రీసత్య నిఖిల్ విజయేంద్ర సింహకి ఒక ఐడి కార్డు ఇచ్చింది. ఈ కార్డు లేకపోతె అతను ఈ షోలో ఉన్నాడో లేడో తెలీడం లేదు అని చెప్పింది. ఇక నిఖిల్ ఐతే ఆమెకు ఒక బొచ్చే ఇచ్చాడు. జైల్లో ఖైదీలకు ఇచ్చే బొచ్చె ఇచ్చి శ్రీసత్య షోలో జైలుకి వెళ్ళినప్పుడు తినడానికి యూజ్ అవుతుంది అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



