నా జీవితం మొత్తం విష్ణు మాత్రమే ఉంటుంది
on Jun 1, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ఫ్రెండ్ షిప్ థీమ్ తో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇక విష్ణుప్రియా బెస్ట్ ఫ్రెండ్ రీతూ చౌదరి వచ్చింది. ఐతే "మీ ఫ్రెండ్ షిప్ లో బెస్ట్ మూమెంట్ ఏది అంటే ఎం చెప్తారు" అని శ్రీముఖి అడిగింది. "నాకు రీతూతో ఉండే ప్రతీ క్షణం చాలా బెస్ట్. మేమిద్దరం కంటి సైగతోనే నవ్వుకుంటాం. నాకు రీతూతో చాల ఎఫెక్షన్ ఉంది. నా కోసం రీతూ కూడా ఏమైనా చేస్తుంది." అని చెప్పింది విష్ణు ప్రియా. "మర్చిపోలేని సిట్యువేషన్ అని ఏదైనా ఉందా" అంటూ శ్రీముఖి రీతుని అడిగింది. "2023 జనవరి ఒకటో రెండో తెలీదు మేమిద్దరం ఒక ట్రిప్ కి వెళ్లాం..ఫ్లయిట్ టేకాఫ్ అవుతున్నప్పుడు మనం ట్రిప్ నుంచి వచ్చేసరికి మా అమ్మ బతికి ఉంటే చాలు అని ఒక మాట అంది. నాకేం అర్ధం కాలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మేము ట్రిప్ కి వెళ్లాం. బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసాం. తర్వాత జనవరి 22 న మా డాడీ చనిపోయారు. ఆ టైములో ఎం చేయాలో తెలీక విష్ణుకి కాల్ చేసాను. అప్పుడు విష్ణు ఒక ఈవెంట్ లో ఉంది. తన అసిస్టెంట్ ఫోన్ తీసాడు. కానీ విష్ణు మాత్రం మాట్లాడలేదు. నాకు కోపం వచ్చింది. రెండో రోజు నాన్న కార్యక్రమాలు ఐపోయాయి. నాకు మా అమ్మ, నాన్న, అన్న, విష్ణు ఉంటే చాలు అనిపించేది. అప్పుడు విష్ణు దగ్గర నుంచి కాల్ వస్తే మా ఫ్రెండ్ నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పింది. మాట్లాడు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అని చెప్పింది. నాకు ఒక్క నిమిషం ఎం అర్ధం కాలేదు. బాధల్లో కూడా ఇలా కలిశామా అనిపించింది. నా లైఫ్ మా నాన్నను ఎవరైనా రీప్లేస్ చేయగలరు అంటే అది ఒక్క విష్ణు మాత్రమే. గోవా, తిరుపతి, అరుణాచలం, బ్యాంకాక్, పారిస్ అన్ని చోట్ల మొదటిసారిగా నన్ను తీసుకెళ్లింది విష్ణు మాత్రమే. నా జీవితం మొత్తం విష్ణు మాత్రమే ఉంటుంది." అని చెప్పింది రీతూ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



