ఆ ఇద్దరికి శ్రీవల్లిపై డౌట్.. ధీరజ్ కి దగ్గరవుతున్న ప్రేమ!
on Jun 1, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -173 లో......శ్రీవల్లి చెల్లి బుజ్జి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. తను వచ్చేసరికి శ్రీవల్లి వంటచేస్తుంది. అక్కడ ఇదే వంట.. ఇక్కడ ఇదే వంటనా.. జాలిగా బావతో హనీమూన్ కి వెళ్లొచ్చు కదా అని అంటుంది. దాంతో శ్రీవల్లి సిగ్గుపడుతుంది.అప్పుడే చందు వచ్చి శ్రీవల్లిని పిలుస్తాడు. అక్క బావ వచ్చాడు.. హనీమూన్ గురించి చెప్పమని బుజ్జి పంపిస్తుంది.
చందు సేట్ డబ్బు అడిగాడని టెన్షన్ లో ఉంటాడు. శ్రీవల్లి వచ్చి బావ మనం హనీమూన్ కి వెళదామంటూ చందుని మాట్లాడనివ్వదు. ఇక చందు సరే అంటాడు. ఇప్పుడు సేట్ డబ్బు కోసం ఆఫీస్ కి వచ్చి గొడవ చేసాడు. నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి డబ్బు ఏర్పాటు చెయ్యమని చెప్పమని అంటాడు. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ సరే అని ఒక దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడే బుజ్జి వచ్చి.. ఏమైందని అడుగుతుంది. అమ్మ నాకు మోసం చేసి పెళ్లి చేసింది.. బావ చాలా మంచోడు.. అలాంటోడిని మోసం చేస్తున్నా.. డబ్బు అడిగాడని చెప్తుంది. దూరం నుండి నర్మద, ప్రేమ ఇద్దరు చూస్తుంటారు. ఏదో పది లక్షలు అంటూ టెన్షన్ పడుతున్నారు.. ఏంటని ప్రేమ నర్మద అనుకుంటరు. ఆ తర్వాత శ్రీవల్లి టెన్షన్ గా భాగ్యంతో ఫోన్ మాట్లాడుతుంది. నీ భర్తకి నువ్వే నచ్చజెప్పుకోమని శ్రీవల్లితో భాగ్యం అంటుంది.
ఆ తర్వాత ఏంటి శ్రీవల్లి అక్క ఎందుకు టెన్షన్ పడుతుందని ప్రేమ, నర్మద అనుకొని.. తన చెల్లి బుజ్జితో కూల్ గా మాట్లాడి తనకి మెకప్ వేస్తూ తన నుండి అసలు విషయం రాబట్టలని అనుకుంటారు. పది లక్షలు ఎక్కడివి? ఎందుకు మీ అక్క టెన్షన్ పడుతుందని అడుగతారు. దాంతో బుజ్జి శ్రీవల్లి దగ్గరికి వెళ్లి ఇద్దరు అక్కలకి డౌట్ వచ్చిందని చెప్తుంది. ఏంటి నా చెల్లి ని ఏం అడుగుతున్నారని ప్రేమ, నర్మదలని శ్రీవల్లి అడుగుతుంది. తరువాయి భాగంలో నువ్వు ధీరజ్ ని ప్రేమిస్తున్నావని ప్రేమతో నర్మద చెప్తుంది. ధీరజ్ ఇంటికి రాగానే భోజనం పెడుతుంది. ధీరజ్ థాంక్స్ అని చెప్పగానే ప్రేమ తన వంక ప్రేమగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



