పెళ్లి కార్డ్ తెచ్చి పృద్వి చేతిలో విష్ణు ప్రియా
on Jun 15, 2025
బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా పృద్వి - విష్ణు ప్రియా జోడి బాగా హిట్ పెయిర్ అన్న పేరు సంపాదించుకుంది. వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు అన్న టాక్ కూడా నడిచింది. విష్ణు ప్రియా తనకు పృద్వి అంటే ఎంత ఇష్టమో ప్రతీ షోలోనూ చెప్తూ ఉంటుంది. ఐతే రీసెంట్ గా కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లో మాత్రం ఒక ఇంటరెస్టింగ్ విషయం బయపడింది. ఇద్దరూ ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. "ఐ వాంట్ టు బి విత్ హర్...ఏ ఫ్రెండ్.." అంటూ పృథ్వి విష్ణు ప్రియాకి తన మినీ వెర్షన్ బొమ్మను ఇచ్చాడు. "నేను నీతో లేకపోయినా నా మినీ వెర్షన్ నీతో ఉండాలని కోరుకుంటా..నువ్వు నా ఫ్రెండ్ షిప్ ని గెలుచుకున్నావ్. అందుకే ఇది నా అవార్డు " అని చెప్పాడు. "మినీ వెర్షన్ ఇలా రాదు..వేరేలా వస్తది" అంటూ చెప్పేసింది విష్ణు ప్రియా. దాంతో అందరూ నవ్వేశారు. "నువ్వు ఇంత అందమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ..నువ్వు నా గుండెల్లో ఉన్నావ్. తర్వాత శ్రీముఖి "విష్ణు నువ్వేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వు" అని చెప్పింది. అప్పుడు ఒక పెళ్లి కార్డ్ తెచ్చి పృద్వి చేతిలో పెట్టింది విష్ణు ప్రియా. అందులో పృద్వి పెళ్లి ఎప్పుడు, వెన్యూ ఎక్కడ, టైం ఏంటి అని క్వశ్చన్ మార్క్స్ తో ఉంది. ఎందుకు ఇది ఇచ్చావ్ అని శ్రీముఖి అడిగింది. "నాకు తెలుసు నీ మనసులో నేను లేను అని. నాకు తెలిసిన గుణవంతులైన అబ్బాయిల్లో నువ్వు ఒకడివి. నీకు ధర్మ పత్నిలాగా అద్భుతమైన అమ్మాయి రావాలి అది నేనైనా అవ్వొచ్చు ఏమో.. కాకపోవచ్చేమో..ఐనా పెళ్లి కార్డు పంపడం మర్చిపోకు" అన్న అర్ధంలో ఈ కార్డు ఇచ్చింది విష్ణు ప్రియా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



