మహానటి మూవీకి నో చెప్పాను...ఎందుకంటే
on Jul 1, 2025
.webp)
మహానటి సావిత్రి బియోగ్రఫీతో వచ్చిన మూవీ "మహానటి". అందులో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలానే నటించింది. నటించింది అనడం కంటే జీవించింది అంటే బాగుంటుంది. ఐతే ఈ మూవీ కోసం కీర్తి సురేష్ ని అప్ప్రోచ్ ఐతే నో చెప్పిందట. ఐతే ఎందుకు నో చెప్పిందో కూడా రీసెంట్ గా రిలీజ్ ఐన "చాట్ షో విత్ సుమ" ఎపిసోడ్ లో చెప్పింది. మహానటి మూవీ మొదట్లో చేయకూడదు అనుకున్నారా "అవును.. నేను ఈ మూవీకి మొదట్లో నో చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ ని మెప్పించగలనా అనిపించింది. ఆడియన్స్ ని నా వైపు తిప్పుకోగలనా..నేను ఏదైనా చేశా అంత మహానటి సావిత్రి గారి పేరును చెడగొడతానేమో అని భయం. కానీ నాగి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు చేస్తారు కచ్చితంగా అటూ నన్ను మోటివేట్ చేశారు. వేరెవరో నా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నేనెందుకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు అనిపించింది.
కానీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తెలీదు ఈ సినిమాను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అసలు ఊహించలేదు. ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళినప్పుడు మాయాబజార్ సీన్ క్లాప్స్ కొట్టారు జనాలు. అప్పుడు అర్ధమయ్యింది. ఇక్కడే క్లాప్ కొట్టారంటే థియేటర్ లో బాగుంటుంది అనుకున్నాం. ఐతే ఈ మూవీ ప్రీమియర్ చూసాక మిక్స్డ్ కామెంట్స్ చేశారు. మా నాన్న చాలా బాగా చేసావ్ అన్నారు. కానీ డాక్యూమెంటరీలా ఐపోతుందేమో అనుకుంటున్నా అన్నారు. రెండు రోజు తెల్లవారుజామున స్వప్న ఫోన్ చేసి మూవీస్ బ్లాక్ బస్టర్ అని చెప్పింది. రెండో రోజు కూడా థియేటర్ కి వెళ్లాం. నేను వెళ్లి ఎవరికీ తెలీకుండా ఒక మూలాన కార్నర్ సీట్ లో కూర్చున్నా. మహానటి అని టైటిల్ పాడినప్పుడు థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లి పోయింది. అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. అప్పుడు తెలిసింది మూవీ హిట్ అని. అప్పుడు అర్ధమయ్యింది సావిత్రి గారిని జనాలు ఎంతగా ఆరాదించారో అని. అలా నేను ఒక మంచి సినిమా చేసాను అని తెలుసుకున్నా. " అని చెప్పింది కీర్తి సురేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



