Brahmamudi : అనామిక ప్లాన్ లో అప్పు బలి కానుందా.. రేవతి ఎవరు?
on Jul 2, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -762 లో... కావ్యకి యామిని ఫోన్ చేసి.. అసలు ఆఫీస్ లో గొడవ జరిగేలా చేసిందే నేను, సిద్ధార్థ్ తో నేనే ఇదంతా చేసానని యామిని చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. ఇక నుండి రోజు ఇలాంటి షాక్ లు తప్పవని యామిని అంటుంది. మరొకవైపు స్టేషన్ బయట ఇద్దరు యువకులు గొడవ పడుతుంటే.. అప్పు వాళ్ళని లోపలిక పిలిపిస్తుంది.
ఏమైందని వాళ్ళని అడుగగా నాకు లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలని ఒకతను అనగానే ఇస్తాను అంటున్నా కూడా కొడుతున్నాడని ఇంకొకతను అంటాడు. ఇస్తాను అంటున్నాడు కదా వదిలేయ్ అని అప్పు అనగానే మేడమ్ మీకు డబ్బు ఇస్తాను మీరే అతనికి ఇవ్వండి అని అతను అనగానే సరే మీరు వెళ్ళండి అని అప్పు అంటుంది. ఆ ఇద్దరు యువకులు బయటకి వచ్చి మన ప్లాన్ సక్సెస్ అని యామినికి ఫోన్ చేసి జరిగింది చెప్తారు. సరే డబ్బు పంపిస్తున్నాను అసలు అప్పు ఈ ఉచ్చులో నుండి బయటకి రాకూడదని యామిని వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవితో రాజ్ మాట్లాడుతుంటే.. అప్పుడే కావ్య ఫోన్ చేస్తుంది. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రండి అనగానే రాజ్ సిగ్గుపడుతూ కావ్య దగ్గరికి వెళ్లిపోతాడు.
కావ్యని రాజ్ కలుస్తాడు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇప్పుడు మా కంపెనీ ప్రాబ్లమ్ లో ఉంది.. మీరు మా బాస్ గా నటించాలని కావ్య అనగానే మొదట రాజ్ ఒప్పుకోడు కానీ ఆ తర్వాత సరే అంటాడు. దాంతో రాజ్ ని కావ్య హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. పదండి మా బాస్ లాగా మిమ్మల్ని ట్రైన్ చెయ్యాలని రాజ్ ని తీసుకొని వెళ్తుంది కావ్య. తరువాయి భాగంలో రేవతి వాళ్ళ బాబు షూస్ కొనివ్వమని ఏడుస్తాడు. డబ్బు లేక రేవతి కొనివ్వదు. అదంతా రాజ్, కావ్య చూసి బాబు కి షూస్ తీసుకొని వస్తారు. రాజ్ ని చూడగానే రేవతి హగ్ చేసుకొని బాగున్నావారా అని అడుగుతుంది. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



