జ్యోత్స్న మీద ఫైర్ అయిన శివన్నారాయణ.. దీపకి ఆయిల్ మసాజ్ చేస్తూ కార్తీక్!
on Jan 12, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -252 లో..... శౌర్య లాకేట్ అడుగుతుందని కార్తీక్ తన మెడలో వేసుకుంటాడు. చూసావా అమ్మ నా కంటే కూడా ఆ లాకెట్ ఎక్కవ అని శౌర్య అనగానే.. ఈ టాపిక్ ఎక్కడికో పోయేలా ఉందనుకోని లాకెట్ తీసి ఇది ఎవరికి కన్పించకుండా దాచేస్తానని కార్తీక్ అంటాడు. అది నాకూ కావాలని శౌర్య అంటుంది. అది నీ మెడలో వేసే రోజు త్వరగా రావాలని అనుకుంటున్నానని దీప అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న చేసిన తప్పుకి ఇంట్లో పెద్ద రచ్చ అవుతుంది. నువ్వు ఇక సీఈఓగా పనికి రావని శివన్నారాయణ అంటాడు.
తనకు సీఈఓగా బాధ్యతలు ఇవ్వడం తప్పు అనడం లేదు కానీ తను నిర్ణయం తీసుకునే రైట్ ఇవ్వడం కరెక్ట్ కాదని సుమిత్ర అంటుంది. నా పరువు తీసావ్ ఆ కార్తీక్, దీపల ముందు నా పరువు పోయిందని జ్యోత్స్నని శివన్నారాయణ కోప్పడతాడు. తాత ఒక్క ఛాన్స్ ఇవ్వు ఇక ఈ తప్పు రిపీట్ అవ్వదని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో సరే అని శివన్నారాయణ ఒక ఛాన్స్ ఇస్తాడు. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం ప్రతిదీ నాకు తెలియాలని దశరథ్ అంటాడు. దానికి జ్యోత్స్న ఒప్పుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వెనకాలే పారిజాతం వెళ్తుంటే.. నువ్వు జ్యోత్స్నతో మాట్లాడడానికి వీలు లేదని పారిజాతంపై శివన్నారాయణ విరుచుకుపడతాడు.
మరొకవైపు శివన్నారాయణ పరువు పోయిందని శ్రీధర్ డాన్స్ చేస్తుంటే.. కావేరి వచ్చి ఏమైందని అడుగగా జరిగింది చెప్తాడు. ఆ తర్వాత దీప చేసిన అవమానం గుర్తుకుచేసుకొని జ్యోత్స్న ఆవేశంతో రగిలిపోతుంటే.. పారిజాతం వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది. ఆ తర్వాత దీప అంతు చూస్తానంటూ ఎవరికో జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరొక వైపు దీప కి చెయ్ నొప్పిగా ఉంటే కార్తీక్ ఆయిల్ మసాజ్ చేస్తాడు. నీ కళ్ళు బాగుంటాయి.. నీ కంటి రెప్పలు అందంగా ఉంటాయంటూ దీప అందాన్ని కార్తీక్ వర్ణిస్తూ ఉంటే దీప మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



