కళ్యాణ్ కొత్త పాట రెడీ.. కావ్యనే కావాలనే చేసిందని తెలుసుకున్న అక్క!
on Jan 12, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-617 లో.....రుద్రాణి రాహుల్ లు కలిసి స్వప్న శ్రీమంతానికి అవసరమయ్యే లిస్ట్ ప్రిపేర్ చేసి ఇదిగో ఇరవై లక్షలు అయిందంటూ కావ్యకి ఇస్తారు. నాకు తెలుసు.. అందుకే ముందే చెక్ రాసి పెట్టమని చెప్పాను.. ఏవండీ ఆ చెక్ ఇవ్వండి అని రాజ్ తో కావ్య అనగానే.. అకౌంట్ లో ఇరవై వేలు కూడా లేవ్ ఈ చెక్ ఎందుకు పనికి రాదని రాజ్ అనుకోని కావ్యకి ఆ చెక్ ఇస్తాడు.
కావ్య ఆ చెక్ ని రుద్రాణికి ఇస్తుంది. చెక్ తీసుకొని రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. స్వప్న శ్రీమంతం రుద్రాణి చేయాలనుకుంటుందని అపర్ణ చెప్తుంది. దాంతో వీలు లేదు మా కూతురు శ్రీమంతం మా ఇంట్లో జరగాలి.. అది పూర్వీకుల తీర్మానం అని కనకం అంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఎందుకు.. మాకు ఉన్నంతలో నేను చేసుకుంటానని కనకం తన నటనతో అందరిని ఒప్పిస్తుంది. సరే అని ఇందిరాదేవి అంటుంది. ఇక స్వప్నకి చిన్నగా శ్రీమంతం చేసుకోవడం ఇష్టముండదు కానీ కనకం తనని ఒప్పిస్తుంది. ఇక ఈ చెక్ తో అవసరం లేదంటూ రుద్రాణి చేతిలో నుండి కావ్య చెక్ తీసుకొని చింపేస్తుంది.
మరొకవైపు కళ్యాణ్ పాట రాస్తుంటే అప్పుడే అప్పు ఫోన్ చేస్తుంది. కరెక్ట్ టైమ్ కి చేసావంటూ ఆ పాటని అప్పుకి వినిపిస్తాడు కళ్యాణ్. తను చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఆ తర్వాత కనకం వల్ల ప్లాన్ ఫెయిల్ అయిందంటూ రుద్రాణి, రాహుల్ లు కోపంగా ఉంటారు. తరువాయి భాగంలో కావాలనే నువ్వు అమ్మకి ఈ ఆలోచన కలిపించి ఇలా చేసావ్ కదా అని కావ్యతో కావ్య అంటుంది. అది తెలుసుకున్న దానివి.. ఎందుకు ఇలా చేసానో అర్థం చేసుకోవా అని కావ్య అనగానే.. అక్క సంతోషంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదంటూ స్వప్న కోపంగా వెళ్లిపోతుంది. అదంతా అపర్ణ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



