Karthika Deepam2: వైరాతో కార్తీక్ వైరం.. ఇప్పుడే మొదలైంది!
on Oct 11, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -485 లో....బోర్డ్ మీటింగ్ జరుగుతుంది.. అందులో నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అనగానే.. మీ కంటే ముందు మేము ఒక నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెంబర్స్ అంటారు. ఈ కంపెనీలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మా ముగ్గురికి ఉంది.. కంపెనీ లాస్ లో ఉంది.. అందుకే మా షేర్స్ అమ్మాలని అనుకుంటున్నామని బోర్డ్ మెంబర్స్ అనగానే అందరు షాక్ అవుతారు. ఎవరికి అమ్ముతున్నారని దశరథ్ అడుగుతాడు.
వస్తున్నాడని వాళ్ళే చెప్తారని బోర్డ్ మెంబర్స్ అంటుండగానే అప్పుడే వైరా వస్తాడు. కార్ దగ్గరున్న డ్రైవర్ కి వైరా మేనేజర్ హాయ్ చెప్తాడు. అతను ఎవరని వైరా అడుగుతాడు. శివన్నారాయణ డ్రైవర్ అని అతను చెప్తాడు. ఆ తర్వాత వైరా లోపలికి ఎంట్రీ అవ్వగానే దశరత్, శివన్నారాయణ షాక్ అవుతారు. మేము అమ్మాలనుకుంటుంది తనకే అని బోర్డు మెంబర్స్ చెప్తారు. దశరథ్ కి వైరాకి మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడే శివన్నారాయణ మేనేజర్ కార్తీక్ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తాడు. కార్తీక్ లోపలికి రావడానికి శివన్నారాయణ పర్మిషన్ అడుగుతాడు. కార్తీక్ ని రమ్మని శివన్నారాయణ చెప్తాడు. మరొకవైపు వంట చేస్తూ దీప మామిడి కాయ పుల్లగా ఉందో లేదో చూస్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. ఏంటి ఏదైనా విశేషామా పుల్లటిది తింటున్నావని అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు అత్తయ్య అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్ లోపలికి వస్తాడు. మీరు పిల్చింది డ్రైవర్ నా అని వైరా వెటకారంగా మాట్లాడుతాడు. అతను మాజీ సీఈఓ.. నా మనవడు అని శివన్నారాయణ చెప్పగానే వైరా షాక్ అవుతాడు.
ఆ తర్వాత కార్తీక్ బోర్డ్ మెంబర్స్ తో మాట్లాడి కన్విన్స్ చేసి షేర్స్ అమ్మకుండా చేస్తాడు. దాంతో వైరా నీతో మాట్లాడాలి కార్తీక్.. బయట వెయిట్ చేస్తానని వెళ్తాడు. బావని ఎందుకు పిలిచారు.. నన్ను ప్రతిసారీ జోకర్ ని చేస్తున్నారని చెప్పి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. శివన్నారాయణ, దశరథ్ ఇద్దరు కార్తీక్ కి థాంక్స్ చెప్తారు. కార్తీక్ బయటకు వెళ్లి వైరాతో మాట్లాడతాడు. నేను మీ మావయ్య తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. నువ్వు అడ్డురాకని కార్తీక్ కి వైరా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



