Karthika Deepam2 : దీప, కార్తీక్ లకి ఒకే పూలదండ.. ఆమెని తాకుతుంటే మురిసిపోయిందిగా!
on Jan 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -251 లో..... కార్తీక్ చేసిన ధర్నాకి ఎంప్లాయిస్ కి సారీ చెప్తుంది జ్యోత్స్న. తిరిగి మళ్ళీ ఆఫీస్ కి రండి అని ఎంప్లాయిస్ కి చెప్తాడు దశరథ్. దాంతో ఎంప్లాయిస్ కార్తీక్ మెడలో పూలమాల వేస్తారు. దీప గురించి ఎంప్లాయిస్ అంతా పొగుడుతుంటే.. జ్యోత్స్న ఓర్వలేకపోతుంది. ఇక దీపని కార్తీక్ సైకిల్ పై ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది.
ఆ తర్వాత కార్తీక్, దీపలు వెళ్తుంటే జ్యోత్స్న అడ్డుపడుతుంది. ఏంటి మమ్మల్ని ఫాలో అవుతున్నావా అని కార్తీక్ అంటాడు. దీప వల్ల ఎలా ఉండేవాడివి ఎలా అయ్యావని జ్యోత్స్న అంటుంటే కార్తీక్, దీపలు జ్యోత్స్నపై విరుచుకుపడతారు. ఆ తర్వాత కార్తీక్ , దీపలు ఇంటికి వస్తారు. అనసూయని ఎప్పుడు వచ్చావని అడుగుతారు. ఆ తర్వాత ఆఫీస్ దగ్గర జరిగిందంతా కార్తీక్, దీప లు చెప్తారు. మెడలో ఈ మాల ఏంటి అని శౌర్య అడుగగా ఫ్యాన్స్ వేశారు.. ఇది మీ అమ్మ మెడలో ఉండాలని దీపకి వేస్తాడు కార్తీక్. ఆ తర్వాత శౌర్య ఇద్దరికి కలిపి వేసి తను కూడా మధ్య లో ఉంటుంది. ఆ తర్వాత ఒక ఫోటో తీసుకుంటారు.
కాసేపటికి దీప దగ్గరికి అనసూయ వచ్చి.. కార్తీక్ గురించి మాట్లాడుతుంది. కార్తీక్ బాబుకి నాపై అభిమానం మాత్రమే ఉందంటూ కార్తీక్ గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కార్తీక్ జ్ఞాపకం అయిన చైన్ ని శౌర్య వేసుకుంటుంది. ఏంటని కార్తీక్ అడుగగా చూపిస్తుంది. దాంతో శౌర్య పరిగెడుతుంది. తన వెంట కార్తీక్ పరిగెడుతాడు. దీప దాన్ని పట్టుకోమంటూ దీపని తాకుతూ ఉంటే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ కి చైన్ ఇస్తుంది శౌర్య. నువ్వు దీన్ని తీస్తావ్.. అందుకే మెడలో వేసుకుంటానని చైన్ ని తన మెడలో వేసుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read