Eto Vellipoyindhi Manasu : మరొక ప్రాజెక్ట్ ఉందంటూ వారిని మోసం చేసిన భద్రం.. సీతాకాంత్ కొత్త ఐడియా అదుర్స్!
on Jan 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -301 లో.....సీతాకాంత్ వాటర్ తీసుకొని రావడానికి వెళ్తుంటే రామలక్ష్మి వద్దని తను వెళ్తుంది. అక్కడ అందరు లైన్ లో ఉంటారు. ఒకావిడ చిన్న బాబుని వదిలిపెట్టి వచ్చాను వాటర్ పట్టుకొనివ్వండి అని అక్కడున్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒప్పుకోకపోగా ఆవిడని తోసేస్తారు. దాంతో రామలక్ష్మికి కోపం వస్తుంది. అక్కడున్న వాళ్ళపై కోప్పడి తనకి రామలక్ష్మి వాటర్ పట్టిస్తుంది.
ఆ గొడవ అంత శ్రీలత, శ్రీవల్లిలు చూసి నవ్వుకుంటారు. రామలక్ష్మి దగ్గరికి వచ్చి నవ్వుకుంటారు. పాపం నీ దగ్గర డబ్బుంటే ఇవ్వమని శ్రీవల్లితో శ్తీలత అనగానే శ్రీవల్లి డబ్బు ఇవ్వబోతుంటే.. మీరు కష్టపడి సంపాదిస్తే ఆ విలువ తెలిసేదని వాళ్ళపై కోప్పడుతుంది రామలక్ష్మి. సీతాకాంత్ అదంతా చూసి రామలక్ష్మి వచ్చేసరికి చూడనట్టుగా ఉంటాడు. రామలక్ష్మి నువ్వు నా వాళ్ళ గురించి చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళను అందలం ఎక్కించాను.. నిన్ను ఈ పరిస్థితిలో ఉంచాను.. అయినా నాపై కోపం లేదని సీతాకాంత్ మనసులో అనుకుంటాడు.
మరొకవైపు సందీప్, ధనల దగ్గరికి భద్రం వచ్చి.. ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అది లాభం వస్తే వంద కోట్లు కానీ ఇప్పుడు అయిదు కోట్లు కావాలని భద్రం అంటాడు. మా దగ్గర ఉన్నాయి అయిదు కోట్లని సందీప్ ధనలు అనుకుంటరు. మీరు కాకపోతే వేరొకరు రెడీగా ఉన్నారని భద్రం అనగానే.. మా దగ్గరున్న డబ్బు ఇస్తామని అన్ని డబ్బులు భద్రంకి ఇస్తారు. ఈ డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోతాను అందరు వచ్చి మిమ్మల్ని అడుగుతారని భద్రం తన మనసులో అనుకుంటాడు. మరొకవైపు సీతాకాంత్ ఒక ప్లాన్ వేస్తాడు. సమస్య మీది పరిష్కారం మాది.. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక తోచిన డబ్బు ఇవ్వండి అని ఒక పేపర్ పై రాస్తాడు. అది చూసి రామలక్ష్మి ఐడియా బాగుంది అంటుంది. ఆ తర్వాత ఒక ఫామ్ ప్లేట్ రెడీ చేయించి ఆటోలకి అంటిస్తాడు. అది ఆటోలో ఎక్కిన వారందరు చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)